
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. లోకల్ కంటెంట్‌కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.
వ్యూహాత్మక పెట్టుబడి
గత మూడేళ్లలో జియోస్టార్ రూ.85,000 కోట్లు వెచ్చించి ప్రముఖ మీడియా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రీజినల్ ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్‌లో భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దృష్టి సారించింది. ఐపీఎల్ సీజన్‌లో 300 మిలియన్ల సబ్‌స్రైబర్లను చేరుకోవడం, క్రికెట్ పట్ల దేశంలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్‌లో సాంకేతిక పురోగతిని పెంచడానికి పెద్దపీట వేస్తుంది.
ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ
స్థానిక కంటెంట్ విస్తరణ విభిన్న భాషా, సాంస్కృతిక ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో జియోస్టార్ హైపర్-లోకల్, ఇండియన్ సెంట్రిక్ కంటెంట్‌పై ఆసక్తిగా ఉంది. ఇందులో ప్రాంతీయ క్రీడలు, వినోదం కీలకంగా మారబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్నందున జియోస్టార్ తన డిజిటల్ పంపిణీ ఛానళ్లను బలోపేతం చేస్తోంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు లేదా ప్రత్యక్ష ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృత ప్రేక్షకులకు కంటెంట్ అందుబాటులో ఉండేలా చూస్తోంది.