భారత్‌కు ఫిన్లాండ్‌ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్‌ | Reliance Consumer Products Partners With Fazer To Introduce Premium Chocolates In India, Check More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఫిన్లాండ్‌ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్‌

Mar 8 2026 7:54 AM | Updated on Mar 8 2026 12:59 PM

Reliance Consumer Products Partners with Fazer to Introduce Premium Chocolates in India

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కి చెందిన ఆహారోత్పత్తుల దిగ్గజం ఫేజర్‌తో రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫేజర్‌ ప్రీమియం చాక్లెట్లను భారత్‌లో ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలను ఆర్‌సీపీఎల్‌ చేపట్టనుంది. ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ భారత పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

పోలాండ్, చైనా తదితర 40 పైగా దేశాలకు ఫేజర్‌ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్‌సీపీఎల్‌ సంస్థ టాఫీమ్యాన్, పాన్‌ పసంద్, లోటస్‌ చాక్లెట్స్‌లాంటి పలు దేశీ బ్రాండ్లను పునరుద్ధరించింది. అలాగే మాలిబాన్, నెక్స్‌బా, పేస్‌లాంటి గ్లోబల్‌ బ్రాండ్స్‌ని కూడా ప్రవేశపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement