మహిళా సాధికారతకు ఎస్‌బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం | State Bank Of India Launches 500 Million Loan Facility To Boost Women Empowerment, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు ఎస్‌బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం

Mar 8 2026 7:47 AM | Updated on Mar 8 2026 1:13 PM

State Bank of India Launches 500 Million Loan Facility to Boost Women Empowerment

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్‌ సోషల్‌ టర్మ్‌ రుణ సదుపాయాన్ని ప్రకటించింది. ఇందులో గ్రీన్‌షూ ఆప్షన్‌ కూడా ఉంటుంది.

లింగ సమా నత్వం, సమగ్ర ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఈ రుణం అందించనున్నట్లు బ్యాంకు తెలిపింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) సిద్ధాంతాలపై బ్యాంకు చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement