ఐటీ శాఖకు ఆర్థిక మంత్రి సీతారామన్ సూచన
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే, నిజాయితీగా చెల్లించేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు. 167వ ఆదాయపు పన్ను దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
అధికారులు మానవీయ దృక్పథంతో పని చేయాలని ఆమె పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎగవేసేవారికి, పొరపాటున తప్పులు చేసే వారికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే ఆదాయపు పన్ను శాఖకు అయిదు ప్రాధాన్యతలను (గుర్తించడం, స్పందించడం, పరిష్కరించడం, పునఃసమీక్షించడం, సంస్కరించడం) ఆమె నిర్దేశించారు.


