హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్‌ | IHCL Gateway brand reached 50 hotel milestone with signing of property in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్‌

Mar 13 2026 12:38 AM | Updated on Mar 13 2026 12:38 AM

IHCL Gateway brand reached 50 hotel milestone with signing of property in Hyderabad

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) హైదరాబాద్‌లోని సోమాజిగూడలో గేట్‌వే బ్రాండ్‌ కింద హోటల్‌ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లయిన డి శివరామరాజు, డీవీఎస్‌ సోమరాజుతో జట్టు కట్టింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న ప్రాపరీ్టని గేట్‌వే హోటల్‌గా మార్చనున్నారు.

ఇందులో 225 గదులు, ఆల్‌–డే డైనింగ్‌ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్‌ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో కలిపి ఐహెచ్‌సీఎల్‌కి తెలంగాణలో మొత్తం 8 హోటళ్లు ఉంటాయి. వీటిలో మూడు అభివృద్ధి దశలో ఉన్నాయి. అలాగే, బ్రాండ్‌ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరుతుందని గేట్‌వే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లియా టాటా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement