Gateway Hotel
-
హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్ గేట్‌వే హోటల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) హైదరాబాద్‌లోని సోమాజిగూడలో గేట్‌వే బ్రాండ్ కింద హోటల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లయిన డి శివరామరాజు, డీవీఎస్ సోమరాజుతో జట్టు కట్టింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న ప్రాపరీ్టని గేట్‌వే హోటల్‌గా మార్చనున్నారు.ఇందులో 225 గదులు, ఆల్–డే డైనింగ్ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో కలిపి ఐహెచ్‌సీఎల్‌కి తెలంగాణలో మొత్తం 8 హోటళ్లు ఉంటాయి. వీటిలో మూడు అభివృద్ధి దశలో ఉన్నాయి. అలాగే, బ్రాండ్ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరుతుందని గేట్‌వే హోటల్స్ అండ్ రిసార్ట్స్ వైస్ ప్రెసిడెంట్ లియా టాటా తెలిపారు. -
గంటాతో ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు భేటీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో రాష్ట్రంలోని ఇంటర్ ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు మంగళవారం హోటల్ గేట్‌వేలో భేటీ అయ్యారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా గంటాను కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి... ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఇంటర్ ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులకు గంటా హామీ ఇచ్చారు. జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం వద్దని కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇంటర్ జంబ్లింగ్ విధానంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితోనే జంబ్లింగ్‌ను గంటా పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఆ క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
కలెక్టర్ల సదస్సు రెండో రోజు
విజయవాడలోని గేట్ వే హోటల్ లో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. జిల్లాల వారీగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్దిపై కలెక్టర్లు, ఇన్ ఛార్జి మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు, అనుకూలతలు అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. -
విజయవాడలోని ఓ హోటల్లో బాబుగారి డాబు


