టీవీఎస్‌.. ఆర్బిటర్‌ వీ1 | TVS has launched the new Orbiter V1 in India at a starting price of Rs 49999 | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌.. ఆర్బిటర్‌ వీ1

Mar 13 2026 12:30 AM | Updated on Mar 13 2026 12:30 AM

TVS has launched the new Orbiter V1 in India at a starting price of Rs 49999

ధర రూ. 49,999 నుంచి ప్రారంభం 

చెన్నై: ఆటోమొబైల్‌ దిగ్గజం టీవీఎస్‌ మోటార్స్‌ తమ ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోని విస్తరించింది. తాజాగా 1.8 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీతో ఆర్బిటర్‌ వీ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఆవిష్కరించింది. దీనితో పాటు 3.1 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీతో ఆర్బిట ర్‌ వీ2 వేరియంట్‌ కూడా లభిస్తుంది.

బ్యాటరీ యాజ్‌ ఏ సరీ్వస్‌ (బీఏఏఎస్‌) విధానంలో ఆర్బిటర్‌ వీ1 ధర రూ. 49,999 (ఢిల్లీ ఎక్స్‌షోరూం). బీఏఏఎస్‌యేతర విధానంలో రేటు రూ. 84,500 (ఢిల్లీ ఎక్స్‌షోరూం). పూర్తి బ్యాటరీ ఖరీదును ముందస్తుగా చెల్లించాల్సిన   లేకుండా, తక్కువ రేటుకే వాహనాన్ని సొంతం చేసుకునేందుకు బీఏఏఎస్‌ విధానం ఉపయోగపడుతుందని కంపెనీ ప్రెసిడెంట్‌ (ఇండియా 2డబ్ల్యూ బిజినెస్‌) గౌరవ్‌ గుప్తా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement