ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఏసీలు | Flipkart Expands Smart Cooling Portfolio with Motorola Air Conditioners | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఏసీలు

Mar 12 2026 9:27 PM | Updated on Mar 13 2026 10:12 AM

Flipkart Expands Smart Cooling Portfolio with Motorola Air Conditioners

వేసవి కాలం దగ్గరపడుతున్న సమయంలో.. ప్రముఖ స్వదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో మోటోరోలా ఎయిర్ కండిషనర్ల కొత్త శ్రేణిని విడుదల చేసింది. ఈ ACలు వినియోగదారులకు సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. ఈ కొత్త శ్రేణి ధరలు సుమారు రూ.28,990 నుంచి ప్రారంభమవుతాయి.

సాధారణంగా ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ఫీజులు, కాపర్ పైపింగ్, అవుట్‌డోర్ యూనిట్ స్టాండ్ వంటి అదనపు ఖర్చులు వస్తాయి. కానీ మోటోరోలా ఏసీలలో ఈ ఖర్చులన్నీ ముందుగానే ధరలో చేర్చారు. అందువల్ల వినియోగదారులకు కొనుగోలు తరువాత అదనపు ఖర్చులు ఉండవు. అంతే కాకుండా.. అదనంగా మూడు సంవత్సరాల పాటు గ్యాస్ రీఫిల్ కూడా లభిస్తుంది.

ఈ ఎయిర్ కండిషనర్లు ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్‌తో రూపొందించారు. ఇవి భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement