ఆ రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఓకే.. | NCLT clears Sequent Scientific Viyash Life Sciences merger | Sakshi
Sakshi News home page

ఆ రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఓకే..

Nov 20 2025 8:31 AM | Updated on Nov 20 2025 8:34 AM

NCLT clears Sequent Scientific Viyash Life Sciences merger

జంతు ఔషధాల తయారీ సంస్థ సీక్వెంట్‌ సైంటిఫిక్, బల్క్‌ ఔషధాల ఉత్పత్తి సంస్థ వియాష్‌ లైఫ్‌సైన్సెస్‌ విలీన స్కీమునకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోద ముద్ర వేసింది. దీనితో అంతర్జాతీయంగా జంతు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్లో మరింతగా విస్తరించే దిశగా విలీన సంస్థకు మార్గం సుగమం అవుతుందని వియాష్‌ లైఫ్‌సైన్సెస్‌ తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇరు సంస్థల ఆదాయాలు రూ. 1,650 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. తమ ఆర్‌అండ్‌డీ, తయారీ సామర్థ్యాలు, విస్తృతమైన సరఫరా వ్యవస్థ దన్నుతో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతామని వియాష్‌ వ్యవస్థాపకుడు హరిబాబు బోడెపూడి ధీమా వ్యక్తం చేశారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతులు, జంతు సంరక్షణ నిపుణులకు అవసరమైన ఉత్పత్తులను అందించే ప్రపంచ స్థాయి సంస్థగా కంపెనీ ఎదుగుతుందని సీక్వెంట్‌ ఎండీ రాజారామ్‌ నారాయణన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement