ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు 'రివర్ మొబిలిటీ' హైదరాబాద్‌లో అత్తాపూర్, ఆర్‌సీ పురం, హైటెక్ సిటీ (మాధపూర్)లలో మూడు కొత్త స్టోర్‌లను ప్రారంభించడంతో తెలంగాణలో తన ఉనికిని విస్తరించింది. సన్‌రైజ్ మోటోహైవ్ ఎల్‌ఎల్‌పీ.. భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ మూడు స్టోర్‌లు వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడంతో పాటు.. యాక్ససరీస్ కూడా అందిస్తాయి.
ఈ కొత్త స్టోర్స్ ద్వారా.. ఆప్టర్ మార్కెట్ సర్వీస్ కూడా పొందవచ్చు. రివర్ మొబిలిటీ ఇప్పుడు భారతదేశం అంతటా 45 స్టోర్లను కలిగి ఉంది. జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, బీహార్ మొదలైన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తన ఉనికిని తెలంగాణాలో విస్తరిస్తోంది.
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర ధర రూ. 1,44,999 (ఎక్స్-షోరూమ్). హైదరాబాద్ కొత్త స్టోర్లలో టెస్ట్ రైడ్స్ కోసం బుక్ చేసుకోవచ్చు. ఈవీల కోసం బుక్ చేసుకోవచ్చు కూడా.


