అందుకే.. బ్రేకింగ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది! | Common Driving Mistakes That Damage Your Car Braking System, Check Out The Main Reasons Inside | Sakshi
Sakshi News home page

అందుకే.. బ్రేకింగ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది!

Feb 26 2026 9:01 PM | Updated on Feb 27 2026 12:43 PM

Common Driving Mistakes That Damage Your Car Braking System

ఒక కారులో సేఫ్టీ అంటే.. అందులోనే సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు. బ్రేకింగ్ సిస్టం చాలా అవసరం. ఎయిర్ కండిషనింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు & పవర్ విండోస్ వంటి వాటిలో సమస్య తలెత్తితే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ బ్రేకింగ్ సిస్టం దెబ్బతింటే మాత్రం అది వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెడుతుంది.

బ్రేక్స్ అనేవి వాహనాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా.. దానిని కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వేడి, ఒత్తిడి మధ్య పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే సరైన డ్రైవింగ్ & నిర్వహణ, బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచవచ్చు. బ్రేకింగ్ సిస్టం తొందరగా డ్యామేజ్ కావడానికి కారణాలు ఏమిటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

హార్డ్ బ్రేకింగ్: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ప్యాడ్లు, డిస్కులు తొందరగా నశిస్తాయి.
ఓవర్ స్పీడ్ డ్రైవింగ్: ఎక్కువ స్పీడ్‌లో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.
ఓవర్‌లోడింగ్: వాహనంపై అధిక బరువు వేయడం బ్రేక్ భాగాలపై అదనపు ఒత్తిడి పెడుతుంది.
క్వాలిటీ లేని బ్రేక్ ప్యాడ్లు: నాసిరకం లేదా డుప్లికేట్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి.
బ్రేక్ ఫ్లూయిడ్ సమస్యలు: ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, లీక్ అవడం వల్ల కూడా బ్రేకింగ్ పనితీరు తగ్గుతుంది.
కాలిపర్ స్టికింగ్: బ్రేక్ కాలిపర్ సరిగా రిలీజ్ కాకపోతే ప్యాడ్లు ఎప్పుడూ డిస్క్‌ను తాకుతూ ఉంటాయి, దీంతో వేగంగా వేర్ అవుతుంది.
డిస్క్/డ్రమ్ వంకర పడటం: అధిక వేడి లేదా నీటిలో నడపడం వల్ల డిస్కులు వంకరపడే అవకాశం ఉంది.
మలినాలు చేరడం: బ్రేక్ భాగాల మధ్య మలినాలు చేరితే ఘర్షణ పెరిగి తొందరగా పాడవుతాయి.
సర్వీసింగ్: సమయానికి చెక్ చేసి సర్వీస్ చేయకపోవడం, ప్యాడ్లు మార్చకపోవడం వల్ల ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.
డ్రైవింగ్ అలవాట్లు: గేర్ తగ్గించకుండా బ్రేక్‌లపై మాత్రమే ఆధారపడటం, హాఫ్-క్లచ్ డ్రైవింగ్ వంటి అలవాట్లు బ్రేక్‌ల జీవితం తగ్గిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement