శాన్‌ఫ్రాన్సిస్కోలో 15 మందికి గాయాలు
శాన్‌ఫ్రాన్సిస్కో: నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్న కేబుల్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో 15 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. నోబ్‌హిల్‌లోని లీవెన్‌వర్త్–హైడ్ వీధుల మధ్య కేబుల్ కారు సోమవారం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ సమయంలో వాహనంలో 15 మంది ఉన్నారు. కారు ఆగిపోవడంతో కుదుపుల వల్ల ప్రయాణికులు గాయపడ్డారు.
శాన్‌ఫ్రాన్సిస్కో మున్సిపల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌ఎమ్‌టీఏ) ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. కారు విండ్ïÙల్డ్ పగిలి ఉంది. ఎరవైనా బలమైన వస్తువును కారుపై విసిరేసి ఉండవచ్చని, దీంతో డ్రైవర్ హఠాత్తుగా కారును ఆపేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ కేబుల్ కార్లను 1870లో ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో మూడు కేబుల్ కారు లైన్లున్నాయి. ప్రయాణికుల భద్రత తమ ప్రాధాన్యతని, ప్రమాదానికి గల కారణాలను సమీక్షిస్తామని ఎస్‌ఎఫ్‌ఎమ్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది.


