
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.
ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్‌కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు.
సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు
‘‘ఈ రైడ్‌తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.
చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు