
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.
మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్‌ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్‌కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.
కొంకణ్‌లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్‌లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్‌ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్‌తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు.పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు.
సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకు
ఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గరంలోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.
వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్‌ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది.
లెమన్‌గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)
ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్‌గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్‌గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్‌ను తయారు చేయొచ్చు.లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను రిటైల్ , బల్క్‌లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.
కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి.