ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడి కాలేదు.
కాగా, డిసెంబర్ 14న (ఆదివారం) సిడ్నీలోని బోండీ బీచ్‌కు సమీపంలో గల ఓ చిన్న పార్కులో యూదులు "హనుక్కా బైదసీ" అనే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సాయుధులు వేడుకల్లో మునిగిపోయిన యూదులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు.
ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు సహా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని నవీద్ అక్రమ్‌గా గుర్తించగా.. మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు పాకిస్తాన్ జాతీయులు. నవీద్‌కు ఐఎస్‌ఐఎస్ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.


