ఆస్ట్రేలియా బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది అమాయక ప్రజలను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్ మాట్లాడినట్లు పేర్కొంది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని తెలిపింది.
ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని కొద్దికాలం క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈకాల్పుల ఘటనపై ఉగ్రవాది నవీద్ అక్రమ్ తల్లి స్పందించింది. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే అక్రమ్ తనతో మాట్లాడరని తెలిపింది.
ఉగ్రవాది తల్లి వెరినా మాట్లాడుతూ "ఘటన జరగడానికి కొద్ది సేపు మందు నా కొడుకుతో మాట్లాడా అక్రమ్ చాలా సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే స్కూబా డ్రైవింగ్‌కు, స్విమ్మింగ్‌కు వెళ్లివచ్చాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది హోటల్‌లోనే ఉంటాను. కొద్దిసేపు తర్వాత తింటాను " అని అక్రమ్ అన్నారని తన తల్లి పేర్కొంది. తన కొడుకు చాలా మంచివాడని అతనికి ఏలాంటి దురలవాట్లు లేవని,స్నేహితులతో కూడా ఎక్కువ తిరగడని తనకు పనికి వెళ్లడం ఇంటికి రావడం తప్ప మరేది తెలియదని ఆమె అంది.
అయితే తన కుమారుడి చిత్రాలను ప్రస్తుతం చూపిస్తున్న చిత్రాలతో సరిపోల్చలేమని తెలిపింది. నవీద్ అక్రమ్ సిడ్నీలోని హెకెన్‌బర్గ్- అల్- మురాద్ ఇనిస్టిట్యుూట్‌లో ఖురాన్ సంబంధింత అధ్యయనాలని పూర్తి చేశాడు. 2024లో అక్కడే ఒక గృహాన్ని కొనుగోలు చేశాడు. ఇటీవల తన పని చేస్తున్న నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో అతని ఉద్యోగం పోయినట్లు అతని తల్లి తెలిపింది.


