లోయలో పడ్డ స్కూల్‌ బస్సు.. 17 మంది మృతి | School Bus Plunges Off Cliff In Colombia | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ స్కూల్‌ బస్సు.. 17 మంది మృతి

Dec 15 2025 10:26 AM | Updated on Dec 15 2025 10:46 AM

School Bus Plunges Off Cliff In Colombia

ఆంటియోకియా: ఉత్తర కొలంబియాలో విషాదం జరిగింది. లోయలో స్కూల్‌ బస్సు పడటంతో 17 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. విహార యాత్ర తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. బస్సు కరేబియన్ పట్టణం టోలు నుండి మెడెలిన్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో ఆంటియోకియోకి చెందిన హై స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఈ ప్రమాదం ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులతో బస్సు.. సుమారు 80 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ పర్యటన అధికారిక స్కూల్ కార్యక్రమం కాదని.. విద్యార్థులే స్వయంగా నిర్వహించారని పాఠశాల స్పష్టం చేసింది. మృతుల్లో బస్సు డ్రైవర్  ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement