
బోరున విలపిస్తున్న జస్మిత తల్లి
సాక్షి, నల్గొండ: పట్టణంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందింది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సును రివర్స్ చేస్తుండగా.. డ్రైవర్ చిన్నారిని గమనించుకోలేదని తేలింది. మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.