హైదరాబాద్: తాను రేపు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) విచారణకు హాజరు కాలేనని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీపై రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాగా, తాను సిట్ విచారణకు రేపు(శుక్రవారం, జనవరి 30) రాలేనని కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్ స్పందించింది.


