మహిళతో ప్రభుత్వ వైద్యుని అసభ్య ప్రవర్తన
మహబూబాబాద్ జిల్లా: జ్వరంతో చికిత్స కోసం క్లినిక్‌కు వచ్చి న ఓ మహిళతో ప్రభుత్వ ఆయుర్వేదిక్ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ సంఘట నపై బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ మహిళకు తీవ్రంగా జ్వరం రావడంతో శనివారం రాత్రి విజయలక్ష్మి క్లినిక్‌కు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆ యుర్వేదిక్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్ట ర్ కిరణ్‌కుమార్ విజయలక్ష్మి క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు.
వైద్య పరీక్షలు చేసి సెలైన్ ఎక్కిస్తున్న క్ర మంలో.. డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్ర వర్తించినట్లు బాధిత మహిళ తన భర్త, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆగ్ర హానికి గురైన మహిళ భర్త, తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం డాక్టర్ కిరణ్‌కుమార్‌తో గొడవపడి దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేశ్, ఎస్‌ఐలు ఉపేందర్, అంజమ్మ తెలిపారు.


