వైఎస్‌ జగన్‌ను కలిసిన ఖమ్మం వైఎస్సార్‌సీపీ అభిమానులు | Khammam Ysrcp Fans Meets Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఖమ్మం వైఎస్సార్‌సీపీ అభిమానులు

Jan 29 2026 7:44 PM | Updated on Jan 29 2026 8:07 PM

Khammam Ysrcp Fans Meets Ys Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఖమ్మం వైఎస్సార్‌సీపీ అభిమానులు కలిశారు. ఇటీవల  వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారన్న కారణంతో ఏకంగా 11 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపిన వైనాన్ని అభిమానులు.. వైఎస్‌ జగన్‌ను కలిసి వివరించారు.

తమపై పోలీసులు క్రిమినల్‌ కేసులు పెట్టి నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లతో జైలుకు పంపారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్‌ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. పార్టీ క్యాడర్‌కు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పుత్తా ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ను  ఖమ్మం జిల్లా అభిమానులు ఆలస్యం సుధాకర్‌, మర్రి శ్రీనివాస్‌, యర్రా నాగరాజు రెడ్డి, గంగారపు మురళీ, సరికొండ రామరాజు, గంగరబోయిన రవి, పగిళ్ళ నాగేష్‌, ముదిరెడ్డి శివారెడ్డి కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement