
బొగోటా: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ పాలనలోని భారత్‌లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్మంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియాలో ఈఐఏ యూనివర్శిటీలో విద్యార్థులను రాహుల్ కలిశారు. దీనిలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా మాట్లాడారు.
‘ ప్రజాస్వామ్యం అనేది ప్రతీ ఒక్కరికీ చోటును కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడులు జరగుతున్నాయి. భారత దేశ జనాభా 140 కోట్లు ఉంది. చైనా పరంగా చూస్తే భారత్ అనేది పూర్తిగా భిన్నం. చైనా అనేది కేంద్రీకృత వ్యవస్థలా ఏకరీతిలో ఉంది. భారత్ వికేంద్రీకృతమై ఉంది. సంస్కృతులు, సంప్రదాయాలు మరియు మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది.
చైనా చాలా కేంద్రీకృతమై, ఏకరీతిగా ఉంది. భారతదేశం వికేంద్రీకృతమై ఉంది బహుళ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని సమకూర్చే శక్తి భారత్ వద్ద ఉంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత భారత్ ఒకే లైన్‌లో లేదు. నాయకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలి. అందులో ప్రధానమైనది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ఒకటి’ అంటూ విమర్శించారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రచార ఆర్భాట నాయకుడే తప్ప ఏమీ లేదంటూ కౌంటరిచ్చింది. విదేశీ గడ్డపై భారత్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమే ఇందుకు నిదర్శమనమంటూ ధ్వజమెత్తింది. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ప్రపంచ పటంలో భారత్ గణనీయ అభివృద్ధి రాహుల్‌కు కనబడటం లేనట్లుంది అంటూ ఎద్దేవా చేసింది.