ఉదయగిరి మండలంలో ఘటన
ఉదయగిరి రూరల్: విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న ఆర్టీసీ స్కూల్ బస్సులో పొగలు రావడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానపల్లె పంచాయతీ కొట్టాలు సమీపంలో జరిగింది.
ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని సా.5 గంటల సమయంలో గంగులవారి అయ్యవారిపల్లెకి బయల్దేరింది. కొట్టాలు గ్రామానికి రాగానే బస్సులో డ్రైవర్ వద్ద ఉన్న స్విచ్ బోర్డు షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు, పొగలు రావడంతో డ్రైవర్ బస్సును ఆపేశారు. దీంతో విద్యార్థులు బస్సు నుంచి కిందకు దూకి పరుగులు తీశారు. డ్రైవర్ మంటలను అదుపుచేశారు.


