అదుపుతప్పి కారు బోల్తా
దగదర్తి: మండల పరిధిలోని సున్నపుబట్టి అటవీ ప్రాంతం వద్ద జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న కారు శనివారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న కారు సున్నపుబట్టి అటవీ ప్రాంతం వద్దకు రాగానే మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. కారులో నలుగురు ప్రయాణిస్తున్నారని వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారన్నారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో నెల్లూరు హాస్పిటల్‌కు తరలించామని ఎస్సై జంపానికుమార్ తెలిపారు.
ఉదయగిరిలో కార్డన్ సెర్చ్
● 26 బైక్‌లు, మూడు ఆటోలు సీజ్
ఉదయగిరి: ఉదయగిరి పట్టణ సమీపంలోని బీసీ కాలనీలో శనివారం సీఐ ఎన్.వెంకట్రావ్, ఉదయగిరి కలిగిరి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది 50 మందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాలనీలోని 270 గృహాల్లో తనిఖీలు నిర్వహించి ఎలాంటి ధ్రువపత్రాల్లేని 26 మోటార్ బైక్‌లు, మూడు ఆటోలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. ఎస్సైలు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు, ఆదిలక్ష్మి, రఘునాథ్, శివకృష్ణారెడ్డి, ఉమా శంకర్, వీరప్రతాప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శాంతినగర్‌లో..
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని శాంతినగర్‌లో శనివారం డీఎస్పీ జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేరాలను అదుపులో ఉంచేందుకు కార్డన్ సెర్చ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనాలకు సంబంధించి లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించడం ద్వారా దొంగతనం చేసిన వాహనాలు, నిందితులను పట్టుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
11.5 కిలోల గంజాయి స్వాధీనం
వెంకటాచలం (పొదలకూరు): ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 11.5 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ పి.అనిత తన సిబ్బందితో కలిసి శనివారం వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్స్ బస్సులో అన్నవరానికి చెందిన రజిత్ పిచ్చాడి అనే వ్యక్తి చైన్నెకు 11.5 కిలోల గంజాయిను తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా అన్నవరంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయిను కొనుగోలు చేసి చైన్నెలో అమ్ముకునేందుకు వెళ్తున్నట్లుగా వెల్లడించాడు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు గిరిబాబు, మురళీమోహన్ పాల్గొన్నారు.
అదుపుతప్పి కారు బోల్తా
అదుపుతప్పి కారు బోల్తా


