విశాఖ : రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం, చింతగట్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. అక్రమ నిర్మాణం చేస్తున్న టీడీపీ నేత నరసింగరావును రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. నిర్మాణం చేపడుతున్నారని సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
నిర్మాణం తొలగించేందుకు జేసీబీ తీసుకెళ్లారు సిబ్బంది. అయితే జేసీబీతో సహా రెవెన్యూ సిబ్బంది రాళ్లు, కర్రలతో దాడి చేసింది టీడీపీ నేత నరసింగరావు అనుచరులు. ఆపై తనకు ప్రాణహాని ఉందని వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


