నెల్లూరు: రాపూర్ మండలంలోని కండలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిజర్వాయర్ సందర్శనకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం(జనవరి1వ తేదీ) వైఎస్సార్‌సీపీ నేతల కండలేరు సందర్భనన అడ్డుకున్నారు.
పొదలకూరు సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ నేతల్ని అడ్డగించారు పోలీసులు. అదే సమయంఓ కండలేరు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. దాంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు కాకాణితో పాటు పలువురు నేతలు.
దీనిపై నేదురమల్లి రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తమను అడ్డకుంటున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అర్థాంతరంగా నిలిపివేస్తే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబులు లోపాయకారీ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శిస్తన్నారు.


