సాక్షి, సంగారెడ్డి: డ్రైవర్ అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్థానికుల సాయంతో డ్రైవర్ పిల్లలను దించేయడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు.
శనివారం ఉదయం నారాయణఖేడ్‌లో విజ్ఞాన్ పాఠశాల బస్సు పిల్లలతో బయల్దేరింది. అయితే ఒక్కసారిగా బస్సు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. స్థానికులను కేక వేసి పిల్లలను వెంటనే దించేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గురువారం అర్ధరాత్రి టైంలో.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూల్ శివారులో ఉల్లిందకొండ క్రాస్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మంటలు ఎగసి పడి బస్సు దగ్ధమైపోగా.. అందులోని ప్రయాణికుల్లో 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవో అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్


