హైదరాబాద్: నగరంలో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. కూల్సుంపుర ఏసీపీ మునావర్‌ను సస్పెండ్ చేశారు సీపీ సజ్జనార్ . అవినీతి ఆరోపణలు, భూ వివాదాలు, కేసుల తారుమారుపై ఏసీపీ మునావర్‌పై వేటు వేశారు. తన మాట వినని పోలీస్ సిబ్బందిని పరువు తీసేలా వ్యవహరించినట్ల విచారణలో తేలింది. దాంతో ఏసీపీ మునావర్ వ్యవహారంపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారుఉ. మ మునావర్ ను హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేస్తూ ఆదేశాలు చేశారు.
ఇటీవల అదే పోలీస్ స్టేషన్‌కు సంబంధించి ఇన్‌స్పెక్టర్ సునీల్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ కీలక కేసుకు సంబంధించి విచారణను ప్రభావితం చేసేలా సునీల్ వ్యవహరించారు. ఉద్దేశ్యపూర్వకంగా కేసులో నిందితుల పేర్లు మార్చి ఒక వర్గానికి అనుకూలంగా వ్యహహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఆ వర్గం నుంచే డబ్బులు కూడా భారీగా అందినట్లు మీడియాలో వెలుగుచూసింది. ఇది ఉన్నతాధికారులు దృష్టికి వెళ్‌లడంతో సునీల్‌ను సస్పెండ్ చేశారు. ఆపై రోజుల వ్యవధిలోనే కూల్సుంపుర ఏసీపీ మునావర్‌ను సస్సెండ్ చేయడం గమనార్హం.
.


