దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్‌గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్‌పేపర్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. మ్యానిఫెస్టోకు సంబంధించిన బాండ్‌పేపర్‌ను గురువారం లక్ష్మీపల్లిలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రశాంత్‌రెడ్డి చేతులమీదుగా గ్రామస్తుల సమక్షంలో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా శివాజీ విగ్రహ ఏర్పాటు, గ్రంథాలయం, హెల్త్‌క్యాంప్‌లు, గ్రామంలో మౌలిక వసతులు కలిపి 20 వరకు ఉన్నాయి. ఇచ్చిన హామీలలో 70 శాతం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తానని.. లేదంటే రాజీనామా చేస్తానని పేర్కొంటూ ఓట్లు అభ్యరి్థంచారు.

గిన్నెలు ఇప్పిస్తా.. ఓటేయండి
ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజులయ్యతండాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తుండగా గిన్నెల వ్యాపారి అటుగా వచ్చాడు. దీంతో వెంటనే సర్పంచ్ అభ్యర్థి ఒక్కొక్క మహిళకు గిన్నెలు ఇప్పించి.. ఓట్లు వేయాలని విన్నవించాడు.
– మరికల్

జర.. ఆగరాదే
స్నానం చేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని.. రిమోట్ కంట్రోల్ గుర్తుకు ఓటేయండి అంటూ అమరచింత మండలంలోని చంద్రనాయక్‌తండాలో సర్పంచ్ అభ్యర్థి కోరగా.. సదరు వ్యక్తి స్పందిస్తూ జర.. ఆగరాదే అనడంతో నవ్వులు పూశాయి.
– అమరచింత


