ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డికి వైద్య పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
హైదరాబాద్: చలికాలంలో చల్లని వాతావరణం గుండెను బలహీనం చేస్తుందని, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుందని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి కాథ్‌ల్యాబ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా అపోలో ఆసుపత్రి సహకారంతో కార్డియాక్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్యాపులో 200 మంది జర్నలిస్టులు బీపీ, ఈసీజీ, 2డి ఎకో, బీఎంఐ, డెంటల్ టెస్టులు చేయించుకున్నారు.
చాలామంది జర్నలిస్టులకు బిపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండటం లేదని, మందులు సరిగ్గా వాడటం లేదని, ఈ విషయంలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. అవసరమైతే అపోలో తరఫున జర్నలిస్టులకు 50 శాతం రాయితీ కూడా ఇస్తామని తెలిపారు. కార్డియాలజిస్ట్ రామకృష్ణ మాట్లాడుతూ చాలామంది జర్నలిస్టులకు చాతిలో నొప్పి, ఎడమచెయ్యి లాగడం, నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు ఇలాంటి హెల్త్ క్యాంపుల్లో బయటపడుతున్నాయని అన్నారు. వైద్యులను ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల సత్కరించారు.


