ఖమ్మం: కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ పరిధి లచ్చతండా ఖమ్మం – మహబూబాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉంటుంది. ఒకే వీధి కలిగిన ఈ తండాలో సీసీ రోడ్డు ఉంది. రోడ్డుకు ఓ పక్క ఖమ్మం జిల్లా లచ్చుతండా పరిధిలోకి వస్తుండగా, ఇంకో పక్క మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. దీంతో ఇటుపక్క 130మంది ఓటర్లు కలిగిన వీధిలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోపక్క మాత్రం డోర్నకల్ మున్సిపాలిటీ కావడంతో సందడి కానరావడం లేదు.


