డ్రగ్స్‌ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా? | Sensational Issues In The Pilot Rohit Reddy Farm House Case | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా?

Mar 15 2026 12:30 PM | Updated on Mar 15 2026 1:46 PM

Sensational Issues In The Pilot Rohit Reddy Farm House Case

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో భారీగా డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్‌ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్‌ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్‌ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్‌ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్‌ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement