ఆ రెండు ఐఫోన్‌లను ఎందుకు ధ్వంసం చేసినట్లు..? | Update on moinabad farmhouse linked to rohith reddy case | Sakshi
Sakshi News home page

ఆ రెండు ఐఫోన్‌లను ఎందుకు ధ్వంసం చేసినట్లు..?

Mar 15 2026 2:25 PM | Updated on Mar 15 2026 3:53 PM

Update on moinabad farmhouse linked to rohith reddy case

సాక్షి,హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్‌ టీం పోలీసులు దాడులు జరిపే సమయంలో ఫాంహౌస్‌లో ధ్వంసమైన రెండు ఐఫోన్‌ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రెండు ఫోన్‌లు పైలెట్‌ రోహిత్‌రెడ్డి అతని పీఏ శ్రవణ్‌దేనని తెలుస్తోంది.

అయితే, ఆ ఫోన్‌లను ధ్వంసం చేసింది పైలెట్‌ రోహిత్‌రెడ్డేనని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశంపై పైలెట్‌ పీఏ శ్రవణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణతో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి తన ఫాంహౌస్‌ జరిగిన వీకెండ్‌ పార్టీలో పైలెట్‌ రోహిత్‌రెడ్డి,అతడి సోదరుడు రితేష్‌ రెడ్డి  ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు దొరికాడు. వీరితో పాటు పలువురు సైతం డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.  

ఈగల్‌ టీం పోలీసులు ఫాం హౌస్‌పై దాడులు జరిపి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement