తమిళనాడు సీఎం విజయ్ తాజాగా ఫోర్ట్ సెయింట్ జార్జ్ వారసత్వ ప్రదేశాలను సందర్శించారు. కూలింగ్ గ్లాసుతో.. వైట్‌షర్ట్ టక్ ఇన్‌తో స్టైలిష్ అవతార్‌లో కనిపించిన ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఈ పర్యటనలో సెయింట్ మేరీస్ చర్చితో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న ఫోర్ట్ మ్యూజియంను ఆయన పరిశీలించారు. దళపతి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.


