ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్‌కు డ్రగ్స్ పాజిటివ్‌ | TDP MP Putta Mahesh Kumar Yadav Arrested in Moinabad Farmhouse Party Case | Sakshi
Sakshi News home page

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్‌కు డ్రగ్స్ పాజిటివ్‌

Mar 15 2026 10:46 AM | Updated on Mar 15 2026 3:23 PM

TDP MP Putta Mahesh Kumar Yadav Arrested in Moinabad Farmhouse Party Case

సాక్షి,హైద‌రాబాద్‌: నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ క‌ల‌క‌లం రేపుతోంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్‌ పార్టీలో డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. 

ఈ వీకెండ్ పార్టీలో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మ‌హేష్ కుమార్‌ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్ర‌క‌టించారు. టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్‌తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్‌ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారంద‌రికి ప్ర‌స్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్‌ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు.  

 డ్రగ్స్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు
అయితే మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్‌ టెస్ట్‌ విషయంలో ఎంపీ పుట్టా మహేష్‌ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్‌ శాంపిల్‌ బదులు వాటర్‌ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్‌ బాటిల్‌లో ఉంది యూరిన్‌ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్‌ శాంపిల్‌ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై పోలీసులు సీరియస్‌ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్‌ నుంచి యూరిన్‌ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్‌ బ్లడ్‌ టెస్టులో పాజిటీవ్‌గా నిర్ధారణైంది.

డగ్స్‌ పార్టీపై ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌..
డగ్స్‌ పార్టీపై ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్‌లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్‌ ఫాం హౌస్‌కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement