breaking news
Driving Skills
-
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్‌లను సర్క్యూట్ రేసింగ్‌లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్‌లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్‌ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్‌లో మరింత స్కిల్‌ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్‌ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
అందుకే.. బ్రేకింగ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది!
ఒక కారులో సేఫ్టీ అంటే.. అందులోనే సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు. బ్రేకింగ్ సిస్టం చాలా అవసరం. ఎయిర్ కండిషనింగ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లు & పవర్ విండోస్ వంటి వాటిలో సమస్య తలెత్తితే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ బ్రేకింగ్ సిస్టం దెబ్బతింటే మాత్రం అది వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెడుతుంది.బ్రేక్స్ అనేవి వాహనాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా.. దానిని కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వేడి, ఒత్తిడి మధ్య పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే సరైన డ్రైవింగ్ & నిర్వహణ, బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచవచ్చు. బ్రేకింగ్ సిస్టం తొందరగా డ్యామేజ్ కావడానికి కారణాలు ఏమిటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.➤హార్డ్ బ్రేకింగ్: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ప్యాడ్లు, డిస్కులు తొందరగా నశిస్తాయి.➤ఓవర్ స్పీడ్ డ్రైవింగ్: ఎక్కువ స్పీడ్‌లో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.➤ఓవర్లోడింగ్: వాహనంపై అధిక బరువు వేయడం బ్రేక్ భాగాలపై అదనపు ఒత్తిడి పెడుతుంది.➤క్వాలిటీ లేని బ్రేక్ ప్యాడ్లు: నాసిరకం లేదా డుప్లికేట్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి.➤బ్రేక్ ఫ్లూయిడ్ సమస్యలు: ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, లీక్ అవడం వల్ల కూడా బ్రేకింగ్ పనితీరు తగ్గుతుంది.➤కాలిపర్ స్టికింగ్: బ్రేక్ కాలిపర్ సరిగా రిలీజ్ కాకపోతే ప్యాడ్లు ఎప్పుడూ డిస్క్‌ను తాకుతూ ఉంటాయి, దీంతో వేగంగా వేర్ అవుతుంది.➤డిస్క్/డ్రమ్ వంకర పడటం: అధిక వేడి లేదా నీటిలో నడపడం వల్ల డిస్కులు వంకరపడే అవకాశం ఉంది.➤మలినాలు చేరడం: బ్రేక్ భాగాల మధ్య మలినాలు చేరితే ఘర్షణ పెరిగి తొందరగా పాడవుతాయి.➤సర్వీసింగ్: సమయానికి చెక్ చేసి సర్వీస్ చేయకపోవడం, ప్యాడ్లు మార్చకపోవడం వల్ల ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.➤డ్రైవింగ్ అలవాట్లు: గేర్ తగ్గించకుండా బ్రేక్‌లపై మాత్రమే ఆధారపడటం, హాఫ్-క్లచ్ డ్రైవింగ్ వంటి అలవాట్లు బ్రేక్‌ల జీవితం తగ్గిస్తాయి. -
స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్! -
శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శీతాకాలంలో పొగమంచు సర్వసాధారణం. ఇది చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వాహనదారులు మాత్రం ఒకింత జాగ్రత్త వహించాలి. లేకుంటే అనుకోని ప్రమాదంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో శీతాకాలం పొగమంచులో డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.పొగమంచులో డ్రైవింగ్ టిప్స్నెమ్మదిగా డ్రైవ్ చేయండి: పొగమంచు ఉన్నప్పుడు మీ వాహనాలను నెమ్మదిగా నడపాలి. అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం మానుకోవాలి. ముందున్న వాహనాలను జాగ్రత్తగా గమనించాలి.ఫాగ్ లైట్స్ ఉపయోగించండి: ప్రయాణించేటప్పుడు.. తప్పకుండా ఫాగ్ లైట్స్ ఉపయోగించాలి. లో బీమ్ హెడ్‌లైట్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు. హైబీమ్ లైట్ ఆన్ చేస్తే.. ఎక్కువ లైటింగ్ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కొంత ఇబ్బందికి గురవుతాయి.సేఫ్ డిస్టెన్స్ పాటించండి: మీకు ప్రయాణించే సమయంలో తప్పకుండా.. ముందు వెళ్తున్న వాహనానికి డిస్టెన్స్ పాటించండి. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగినా.. మీరు ప్రమాదంలో చిక్కుకుండా ఉంటారు. ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.లేన్ డిసిప్లిన్ పాటించండి: వాహనదారులు తప్పకుండా.. రోడ్డు మధ్య లైన్ లేదా ఎడ్జ్ మార్కింగ్ని గమనిస్తూ డ్రైవ్ చేయాలి. ఒకవేళా లేన్ మార్చాల్సి వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు హారన్ మోగించడం మర్చిపోవద్దు. అనవసరంగా హారన్ మోగించవద్దు.తీసుకోవాల్సిన జాగ్రత్తలువాహనం ముందే చెక్ చేయండి: ప్రయాణించే వాహనం కండిషన్ ఎలా ఉందనే విషయాన్ని.. ముందుగానే గమనించాలి. లైట్స్, బ్రేక్స్, వైపర్స్ సరిగ్గా ఉన్నాయా.. పనిచేస్తున్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి. విండ్‌షీల్డ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోండి: ఫాగ్ లైట్ కాంతి ఎక్కువ అనిపిస్తే.. హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఈ లైట్స్ వెనుక వచ్చే వాహనాలకు.. ముందు ఒక వాహనం వెళ్తోందని చూపిస్తాయి.ఇదీ చదవండి: కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!మొబైల్ వాడకండి: పొగమంచుతో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకుండా ఉండాలి. వాహనం డ్రైవింగ్ మీదనే మీ పూర్తి దృష్టి పెట్టాలి. మొబైల్ వాడాలంటే.. వాహనం ఆపి ఉపయోగించుకోవడం మంచిది.ఉదయం, రాత్రి వేళల్లో జాగ్రత్త: ప్రత్యేకింగ్ పొగమంచు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే.. తప్పా ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళా ప్రయాణం తప్పనిసరి అయితే.. కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. -
దక్షిణాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం
జొహన్నెస్‌బర్గ్: వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ అపప్రథ మూటగట్టుకున్న దేశంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అదేసమయంలో, ప్రపంచంలోనే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి కీర్తి కిరీటం ధరించింది. అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రెయినింగ్ కంపెనీ జుటోబీ వార్షిక నివేదికలో ఈ విషయాలున్నాయి. మొత్తం 53 దేశాలకు గాను దక్షిణాఫ్రికా అట్టడుగున 53వ స్థానంలో ఉండగా అమెరికాకు 51, భారత్‌కు 49వ ర్యాంకులు దక్కా యి. రహదారులపై స్పీడ్ లిమిట్లు, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ మోతాదు పరిమితులు, రహదారి ప్రమాదాల స్థాయిలు ఆధారంగా డ్రైవింగ్‌కు సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాలను విశ్లేషించామ ని జుటోబీ తెలిపింది. ప్రతి లక్ష మందిగాను రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోయే సరాసరి సంఖ్య గతేడాది 8.9 ఉండగా ఈసారి ఇది 6.3కు తగ్గిందని జుటోబీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నా అవినీతి అధికారుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమని జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన డ్రైవింగ్ కంపెనీ ఉద్యోగి అలిషా చిన్నాహ్ వ్యాఖ్యానించారు. -
భక్తితో దైవదర్శనం..నవ్వుతూ మృత్యు ఒడిలోకి! వైరల్ వీడియో
TW ⚠️Instead of hitting the brake, she pushed the accelerator at the edge of the hill…Despite not knowing how to drive, she reversed a Toyota Etios as her friend Shivraj Mule recorded. Shweta Survase, 23, from Ch. Sambhaji Nagar, died while making a reel near Dutt Dham… pic.twitter.com/eadsWau9AT— Sneha Mordani (@snehamordani) June 18, 2024అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వెరసి ఒక నిండు జీవితం. కొత్త కారు.. డ్రైవింగ్ సరిగ్గా రాదు. పైగా ఎత్తైన కొండ మీద రివర్స్ తీసుకుంటోంది. ఈ క్రమంలో బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సిలరేటర్ రైజ్ చేసింది. అంతే కళ్లు మూసి తెరిచే లోపే 300 అడుగుల కొండపై నుండి లోయలోకి జారి పడి కన్నుమూసింది. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను శ్వేతా దీపక్ సుర్వాసే (23)గా గుర్తించారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్ ధామ్ టెంపుల్ వద్ద చోటు చేసుకుంది.స్నేహితుడు సూరజ్ సంజౌ ములేతో కలిసి శ్వేతా సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్‌లోని సులిభంజన్ వద్ద దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకున్నారు. తరువాత ఇక్కడ కొండమీద టయోటా ఎటియోస్ కారు డ్రైవ్ చేయాలని ఉత్సాహ పడింది. ఎత్తైన కొండమీద కారును రివర్స్ చేస్తోంది. దీన్ని ములే రికార్డు చేస్తున్నాడు. మెల్లిగా వెనక్కి తీసుకుంటూ ఉండగా పొరపాటున యాక్సిలరేటర్ మీది కాలు వేసింది. దీంతో కారు వేగం పుంజుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అతడు ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే, "క్లచ్, క్లచ్, క్లచ్" అంటూ అరిచాడు. ఆమెను ఆపడానికి పరిగెత్తాడు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు 300 అడుగుల ఎత్తును నుంచి జారి లోయలోకి పల్టీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
90 ఏళ్ల వయసులోనూ “తగ్గేదే లే” అంటున్న బామ్మా
-
లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: యోగాగురు, పంతజలి ఆయుర్వేద అధినేత బాబా రామ్‌దేవ్ ఇటీవల హరిద్వార్‌లో సరికొత్త కారులో ప్రయాణించారు. ఇటీవలే విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130లో రామ్‌దేవ్ ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు వర్ణంలో ఉన్న ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల ఇండియాలో విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130 కారులో వెళ్తూ బాబా రామ్‌దేవ్ కనిపించారు. ఇండియాలో ఉన్న లాండ్ రోవర్ బ్రాండ్‌లో డిఫెండర్ 130 అత్యంత మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డోర్ ఓపెన్ చేసిన రామ్‌దేవ్.. లోపలి భాగాన్ని ఓసారి పరిశీలించారు. కొత్తగా కనిపిస్తున్న కారు డ్రైవర్ సీటులో కూర్చుని నడుపుకుంటూ వెళ్లారు. అయితే.. ఇటీవలే కొన్నట్లు కొత్తగా కనిపిస్తున్న ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) డిఫెండర్ 130 అనేది 2023 ఆరంభంలోనే విడుదలైన మోడల్ కారు. కేవలం రెడ్ కలర్లో మాత్రమే విడుదలైంది. అయితే.. ఇండియాలో ఇటీవలే దీని డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వర్షన్‌కు అడ్వాన్సుడ్‌గా డిఫెండర్ 130 విడుదలైంది. బాడీ 340 ఎంఎం పొడవు గల బాడీ ఉండటమే పాత మోడల్‌కు దీనికి ఉన్న తేడా. ఇదీ చదవండి: పరమ శివున్ని పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే..? -
ఖరీదైన ఫెరారీ కారుతో ఆకాశ్ అంబానీ చక్కర్లు: దీని ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, వ్యాపారవేత్త ఆకాశ్ అంబానీ ఖరీదైన కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.. లగ్జరీ కార్లంటే ఇష్టపడే ఆకాశ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లతో పాటు వరల్డ్‌లోనే లావిష్ కార్లున్నాయి. ఖరీదైన, స్పోర్ట్స్ కార్లను డ్రైవ్ చేస్తూ తరచుగా ముంబై మహానగరంలో దర్శనమిస్తూ ఉంటాడు ఆకాశ్. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!) స్వతహాగా ఖరీదైన కార్ల ప్రేమికుడైన ఆకాశ్‌కు ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడమే కాదు ముంబై వీధుల్లో డ్రైవింగ్ థ్రిల్ అనుభవించడం కూడా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఎరుపు రంగు ఫెరారీ కారులో హల్చల్ చేయడంలో ఫ్యాన్స్ దృష్టిలో పడింది. ఆకాష్ అంబానీ తన డ్రైవింగ్ నైపుణ్యంతో ఫెరారీ SF90ని పరుగులు పెట్టించడం విశేషం. ఇన్‌స్టాలో ఆకాశ్ అంబానీ ఫ్యాన్ పేజీ రెడ్ ఫెరారీ SF90ని నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. ఫ్రంట్ సీట్ లో కూర్చుని వైట్ కలర్ టీ షర్ట్ లో దర్జాగా కనిపించాడు. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఫెరారీ SF90 ధర రూ. 7.50 కోట్లు. నివేదికల ప్రకారం 'ప్రాన్సింగ్ హార్స్' లోగో ఉన్న ఈ కారును భారతదేశంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ కారు ఉంది. 7.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈకారుకు ఇది కారుకు 26 km (16 mi) రేంజ్‌ను అందిస్తుంది. ఇటీవల ఎల్లో కలర్ మెక్లారెన్ కారులో ఆకాశ్ అంబానీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ కారు ధర సుమారు రూ. 3.30 - 4.85 కోట్లు. మెక్లారెన్ కారులో ఫోల్డబుల్ డ్రైవర్ డిస్ప్లే, స్టాటిక్ అడాప్టివ్ హెడ్లైట్లు, వేరియబుల్ డ్రిఫ్ట్ కంట్రోల్, మెక్లారెన్ ట్రాక్ టెలిమెట్రీ ,కార్బన్-సిరామిక్ బ్రేక్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc) -
డ్రైవర్ కు గుండెపోటు.. ఆగిఉన్న వాహనాలపై దూసుకెళ్లిన బస్సు
-
వారెవ్వా.. వాట్ ఏ డ్రైవింగ్ స్కిల్స్
తిరువనంతపురం : హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్కింగ్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ చిన్న సందు దూరినా ఎలాంటి ఆలోచన లేకుండానే మన వాహనాలను పార్క్ చేస్తాం. కారు పట్టే సందు ఉందా.. లేదా అనేది ఆలోచించకుండానే అడ్డగోలుగా పార్క్ చేసినా.. తీరా అది బయటకు తీయాలంటే మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. బైక్ అయితే అంతో ఇంతో కష్టపడి తీయొచ్చు గాని.. కార్లు అలా కాదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వాహనాలు దెబ్బతినడం గ్యారంటీ. కానీ కేరళకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన డ్రైవింగ్ స్కిల్స్‌తో అబ్బురపరిచాడు. (చదవండి : వైరల్: పబ్జీకి అంతిమ వీడ్కోలు) వివరాలు.. కేరళలోని మనంతవాడికి చెందిన పిఎస్ బిజూ ఒకపని మీద తన ఇన్నోవా కారులో వచ్చాడు. తన బండిని పార్క్‌ను చేసేందుకు చిన్న స్థలాన్ని ఏంచుకున్నాడు. నిజానికి ఆ స్థలాన్ని చూస్తే కారు పడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. కానీ బిజూ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఇన్నోవాను పార్క్ చేశాడు. తరువాత పని ముగించుకొని వచ్చిన బిజూ కారును ఎలా బయటకు తీస్తాడో చూడాలనిపించింది. కేవలం చిన్నపాటి ట్రిక్ ఉపయోగించి బైక్‌ను బయటకు తీసినంత సులువుగా ఇన్నోవాను చిన్న దెబ్బ కూడా తగలకుండా తీశాడు. ఇదంతా బిజూ భార్య అతనికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. మళయాలి డ్రైవర్ అద్భుతమైన స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతమని.. అతని నైపుణ్యతకు జోహార్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి : ఫేక్ న్యూస్’ను ప్రశ్నించడం తప్పా!?) That’s Malayalee Driver for you , salute his skill and confidence! Few saw how he took out the car earlier this has both how he parked and how took it out from parking ! Kudos to the guy 👏🏼👏🏼 pic.twitter.com/JwJrCIjTyn — Vijay Thottathil (@vijaythottathil) September 7, 2020 ఇదే విషయమై బిజూను అడిగితే.. అది నా స్నేహితుడి కారు.. కారుకు సంబంధించి పేయింట్ వర్క్ ఉంటే అతను బిజీగా ఉండడంతో ఆదివారం కారును తీసుకొని వర్క్‌షాప్‌కు వెళ్లాను. కారుకు సంబంధించి పని ముగించుకున్న తర్వాత నా భార్యతో కలిసి అదే కారులో షాపింగ్‌కు వెళ్లా.. నేను కారు పార్క్ చేసే సమయంలో నా భార్య వీడియో తీస్తుందని తెలియదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. వీడియోలో ఉన్నది నేనే అని తెలుసుకొని ఆశ్చర్యపోయా. కానీ బేసిక్‌గా నేను 12 మీటర్ల పొడవున్న పెద్ద పెద్ద వాహనాలను నడిపిన అనుభవం ఉండడంతో కారును బయటకు తీయడం పెద్ద కష్టమనిపించలేదు. వాహనం పార్క్ చేసే ముందు కారు సైజ్ ఎంత.. అది అక్కడ పడుతుందా లేదా అన్నది తెలుసుకొని రంగంలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చాడు. -
హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా..
నోటిఫికేషన్ వివరాలు... మొత్తం పోస్ట్‌లు 150 ఎంపికైన వారు హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. భారతీయుడై ఉండాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వారై ఉండాలి. ఏడోతరగతి పాసై కనీసం పదేళ్లు పూర్తికావాలి. 50 ఏళ్లలోపు వయస్సు వారే అర్హులు. లైట్ మోటార్, హెవీ వెహికిల్ లెసైన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. దరఖాస్తు విధానం... అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్, తెలంగాణ పేరిట దరఖాస్తు చేయాలి. ఇందుకు ttp://www.hyderabadpolice.gov.in/HGForm.pdf లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ... అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో ఉన్న కాలమ్స్‌లో వివరాలు పూరించండి. విద్యార్హత పత్రాలు, వయస్సు ధ్రువీకరించే పత్రం, వాహన లెసైన్స్ జిరాక్స్ జత చేయాలి. 4 పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలు. స్థానికత ధ్రువీకరణ పత్రం. రూ.25 రుసుమును దరఖాస్తుతో ఇవ్వాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఆ రుసుం ఉండదు) చెక్‌లు, డీడీలు అనుమతించరు. దరఖాస్తులను 22-11-2014లోపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు జామ్‌బాగ్‌లోని గోషామహల్ స్టేడియంలో అందజేయాలి. దరఖాస్తును పోస్ట్ లేదా ఇతరుల ద్వారా పంపకూడదు. అభ్యర్థే స్వయంగా సంబంధిత అధికారికి సమర్పించాలి. అప్పటికప్పుడు దరఖాస్తును పరిశీలించి హాల్‌టికెట్ జారీ చేస్తారు. అభ్యర్థుల ఎంపిక విధానం... డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. వీటితోపాటుగా మెడికల్‌గా ఫిట్నెస్ ఉన్నట్టు ధ్రువీకరణ వస్తేనే ఎంపిక చేస్తారు. గమనిక: దరఖాస్తులు అమ్మబడవు. ఏ పోలీస్ స్టేషన్లోనూ అందుబాటులో ఉండవు. కేవలం పైన పేర్కొన్న వెబ్‌లో నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్చరిక: దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ తప్పుడు ధ్రువీకరణతో ఎంపికైనా మధ్యలో జరిగే విచారణలో బహిర్గతమైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తారు.


