భక్తితో దైవదర్శనం..నవ్వుతూ మృత్యు ఒడిలోకి! వైరల్‌ వీడియో A woman died after her car reversed into a valley in Chhatrapati Sambhajinagar. Sakshi
Sakshi News home page

భక్తితో దైవదర్శనం..నవ్వుతూ మృత్యు ఒడిలోకి! వైరల్‌ వీడియో

Published Tue, Jun 18 2024 11:34 AM | Last Updated on Tue, Jun 18 2024 1:16 PM

Woman Reverses Car Off Maharashtra Cliff  Falls 300 Feet

కారు రివర్స్‌ చేస్తూ, తప్పిదం...అంతే క్షణాల్లో ప్రాణాలు పోయాయి. వైరల్‌ వీడియో

అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వెరసి ఒక నిండు జీవితం.  కొత్త కారు.. డ్రైవింగ్‌ సరిగ్గా రాదు. పైగా ఎత్తైన కొండ మీద రివర్స్‌ తీసుకుంటోంది. ఈ క్రమంలో బ్రేక్‌ వేయాల్సింది పోయి, యాక్సిలరేటర్‌ రైజ్‌ చేసింది. అంతే కళ్లు మూసి తెరిచే లోపే 300 అడుగుల కొండపై నుండి లోయలోకి జారి పడి కన్నుమూసింది. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను శ్వేతా దీపక్ సుర్వాసే (23)గా గుర్తించారు.  ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్ ధామ్ టెంపుల్ వద్ద చోటు చేసుకుంది.

స్నేహితుడు సూరజ్ సంజౌ ములేతో కలిసి  శ్వేతా సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్‌లోని సులిభంజన్‌ వద్ద దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకున్నారు. తరువాత  ఇక్కడ కొండమీద టయోటా ఎటియోస్‌ కారు డ్రైవ్‌ చేయాలని ఉత్సాహ పడింది. ఎత్తైన కొండమీద కారును రివర్స్‌ చేస్తోంది. దీన్ని ములే రికార్డు చేస్తున్నాడు.  మెల్లిగా వెనక్కి తీసుకుంటూ ఉండగా పొరపాటున  యాక్సిలరేటర్‌ మీది కాలు వేసింది. దీంతో కారు వేగం పుంజుకుంది. ఈ  ప్రమాదాన్ని గుర్తించిన అతడు ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే, "క్లచ్, క్లచ్, క్లచ్" అంటూ అరిచాడు.  ఆమెను ఆపడానికి పరిగెత్తాడు కానీ అప్పటికే  ఆలస్యం జరిగిపోయింది.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు 300 అడుగుల ఎత్తును నుంచి జారి లోయలోకి పల్టీ కొట్టింది. దీంతో  ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement