
తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.
సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే..
గేట్‌మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ప్రమాదం ధాటికి వ్యాన్ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.
கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO
— Polimer News (@polimernews) July 8, 2025