సాక్షి, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి పరీక్ష రోజే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. దీంతో పుట్డెడు దుఃఖాన్ని దిగమింగుతూ. అంతటి శోకంలోనూ ఆ పిల్లాడు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.. ఈ ఘటన పలువురిని కంటతడికి గురిచేసింది.
శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో ఈ రోజు ( శనివారం) అర్ధరాత్రి శివాoపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా నేడు అతని అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే అంతటి దుఃఖంలోనూ అతని కుమారుడు కుమ్మరి ధనుష్ తన బాధను దిగమింగుకుంటూ తూప్రాన్ లోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు.
తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు అతను ఇప్పుడు భౌతికంగా తమవద్ద లేకపోయినటప్పటికీ నాన్న కష్టం వృధా కాకూడదని పరీక్షలకు హాజరవుతున్నానని విలపించాడు. ఈ ఘటన అక్కడి స్థానికులను ఎంతగానో కలిచివేసింది.


