
విశాఖపట్నం: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందూస్థాన్ షిప్యార్డు నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక భారత నౌకాదళ అమ్ముల పొదిలో శుక్రవారం చేరింది. నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్‌కుమార్ త్రిపాఠీ చేతుల మీదుగా నిస్తార్ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు.















