
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న భార్య అంజలి రూపానీ కన్నీంటి పర్యంత మయ్యారు. సోమవారం జరిగే అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని గౌరవ సూచికంగా త్రివర్ణ పతాకం కప్పి ఊరేగింపు నిర్వహించారు. ఆయనకు కడసారి నివాళులర్పిస్తున్న సమయంలో ఆయన భార్య అంజలి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆమెను ఓదార్చిన దృశ్యాలు చూసిన వారి కళ్లు చెమర్చకమానవు.
విజయ్కుమారుడు రుషాభ్ రూపానీ తన తండ్రి అంత్యక్రియల సమయంలో దుఃఖిస్తున్న తల్లిని ఓదార్చిన హృదయ విదారకమైన దృశ్యాలు నెటిజన్లు, పార్టీ శ్రేణులను కంట కన్నీరుపెట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ రూపానీ మరణం పట్ల గుజరాత్ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.
#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4
— ANI (@ANI) June 16, 2025
తండ్రి అకాలమరణంపై కుమారుడు రుషాభ్ రూపానీ మాట్లాడుతూ, ఇది తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా దుఃఖకరమైన సమయం అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి విజయ్ గురించి మాట్లాడుతూ, 50-55 సంవత్సరాలుగా, తన తండ్రి ప్రజల కోసం పనిచేశారని, వారందరూ తమ కష్ట సమయంలో తమకు అండగా వారి పక్కనే ఉన్నారని రుషాభ్ పేర్కొన్నారు.
#WATCH | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot.
He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025
కాగ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఒకరు. ఆరు నెలల తర్వాత తన భార్య అంజలిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి లండన్‌కు వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి: Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య
విజయ్ రూపానీ - అంజలి రూపానీ
విజయ్ రూపానీ- అంజలి రూపానీ ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పనిచేశారు. ఈ పరిచయం నేపథ్యంలోనే అంజలి, విజయ్ 1980లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అంజలి అధికారికంగా ఎలాంటి బాధ్యతల్లో లేనప్పటికీ, బీజేపీ మహిళా మోర్చాకు సీనియర్ నాయకురాలిగా రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరి చిన్న కుమారుడు పూజిత్ 3ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు. ఇపుడీ వయసులో భర్త దూరం కావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు.