
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్(0), సాయిసుదర్శన్(0) పెవిలియన్‌కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజే భారత కథ ముగుస్తుందని అంతా భావించారు.
కానీ కేఎల్ రాహుల్(87 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్(78 నాటౌట్) తమ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడగా నిలిచారు. వీరిద్దరూ 62 ఓవర్లు పాటు తమ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు.
తొలి జోడీగా
ఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత థర్డ్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.
1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్-గిల్ జంట 49 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.
కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 రన్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి.
వీరికంటే ముదు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) పరుగులు చేశారు.
చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్'