breaking news
manchester test
-
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా..
ఇంగ్లండ్‌తో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఓవల్ మైదానంలో గెలిచి సిరీస్ (IND vs ENG)ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే, వర్షం రూపంలో గిల్ సేనకు అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. లండన్ (London)లో గురువారం మొత్తం వాన పడే అవకాశాలు ఉన్నాయి.ఒకవేళ గురువారం నాటి తొలిరోజు ఆట గనుక వరణుడి కారణంగా రద్దయితే.. టీమిండియాకు తిప్పలు తప్పవు. ఇదిలా ఉంటే.. నిజానికి మాంచెస్టర్ (Manchester Test)లో జరిగిన నాలుగో టెస్టులోనే తాము సిరీస్ గెలిచేస్తామని ఇంగ్లండ్ ధీమా వ్యక్తం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించిన స్టోక్స్ బృందం.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే రెండు వికెట్లు తీసింది.అయితే, గిల్ సేన అద్భుత ఆట తీరుతో ఊహించని రీతిలో తిరిగి పుంజుకుని మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోగలిగింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (90) మరోసారి తన అనుభవాన్ని చాటగా.. శుబ్‌మన్ గిల్ (103) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (107), వాషింగ్టన్ సుందర్ (101) అజేయ శతకాలతో రాణించి జట్టును గట్టెక్కించారు.చెత్త రికార్డు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయిందిఈ టెస్టులో టీమిండియా అద్భుత పోరాట కనబరిచినా.. ఓ చెత్త రికార్డు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఒక వేదికపై టెస్టుల్లో అత్యధికసార్లు గెలుపన్నదే రుచి చూడని తొలి జట్టుగా నిలిచింది. కాగా మాంచెస్టర్‌లో భారత జట్టు ఇప్పటి వరకు పది టెస్టులు ఆడగా.. ఇందులో నాలుగు ఓడిపోయింది. తాజా మ్యాచ్‌తో కలిపి ఆరు డ్రా చేసుకుంది. ప్రపంచంలోని ఏ జట్టుకు కూడా ఇంతటి చెత్త రికార్డు లేదు. కాగా టీమిండియా ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చివరగా 1936లో గెలిచింది.ఇక.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతు న్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా ఆతిథ్య ఇంగ్లండ్ రెండు గెలవగా.. టీమిండియా ఒక విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రా కావడంతో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య ఓవల్ మైదానంలో జూలై 31- ఆగష్టు 4 వరకు నిర్ణయాత్మక ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.ఒక వేదికపై అత్యధిక మ్యాచ్‌లు ఆడి.. ఒక్క టెస్టు విజయమూ సాధించని జట్లు ఇవే👉టీమిండియా: ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం, మాంచెస్టర్, ఇంగ్లండ్- ఆడినవి 10.. ఓడినవి 4.. డ్రా 6👉ఆస్ట్రేలియా: నేషనల్ స్టేడియం, కరాచి, పాకిస్తాన్- ఆడినవి 9.. ఓడినవి 5... డ్రా 4.👉బంగ్లాదేశ్: బంగబంధు నేషనల్ స్టేడియం, ఢాకా, బంగ్లాదేశ్- ఆడినవి 9.. ఓడినవి 7.. డ్రా 2👉టీమిండియా: కెన్నింగ్స్టన్ ఓవల్, బార్బడోస్, వెస్టిండీస్- ఆడినవి 9.. ఓడినవి 7.. డ్రా 2.👉శ్రీలంక: లార్డ్స్, లండన్, ఇంగ్లండ్- ఆడినవి 9.. ఓడినవి 3.. డ్రా 6.చదవండి: ‘మీకు మరో దారి లేదు’.. షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది! -
‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)కు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అండగా నిలిచాడు. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఆటగాళ్లకు ముందుగానే ‘షేక్‌హ్యాండ్’ ఇవ్వడంలో తప్పులేదంటూ సమర్థించాడు. జెంటిల్‌మేన్ గేమ్ అంటే.. ఇలాగే ఉండాలంటూ స్టోక్స్‌కు మద్దతు పలికాడు.ఆద్యంతం ఉత్కంఠసౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో డేల్ స్టెయిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జరిగింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్ బృందం ఏకంగా 669 పరుగులు చేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది.నలుగురు హీరోలుఅనంతరం ఊహించని రీతిలో పుంజుకుని ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకూ నిలబడి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (90) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. శుబ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (103) ఆడాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత శిబిరంలో ఆందోళన పెరిగింది.ఈ క్రమంలో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతమే చేశారు. జడ్డూ 107, వాషీ 101 పరుగులతో సత్తా చాటారు. అయితే, వీరు శతకాలకు చేరువైన వేళ.. ఎలాగో ఫలితం తేలదు కాబట్టి ఇక చాలు ఆపేద్దాం అని స్టోక్స్ పదే పదే షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే, జడ్డూ మాత్రం ఇందుకు నిరాకరించాడు.సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాతే డ్రాఇక జడ్డూ, వాషీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా డ్రాకు సమ్మతం తెలిపింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ తీరుపై విమర్శలు వచ్చాయి. సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ కూడా.. జడేజా, వాషీ శతకాలు పూర్తి చేసుకునేందుకు అర్హులంటూ స్టోక్స్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు.స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదుఇందుకు ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బదులిస్తూ.. ‘‘షామో.. ఉల్లిపాయ ఎన్నో పొరలతో నిర్మితమై ఉంటుంది. ఒక్కో పొర తీస్తున్నకొద్దీ ఎవరో ఒకరు ఏడవక తప్పదు. సంక్లిష్టమైన సందర్భాల్లో దీనిని మనం అన్వయించుకోవచ్చు.అక్కడున్న బ్యాటర్లు సెంచరీలు పూర్తి చేసేందుకు ఆడటం లేదు. కేవలం మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకే వారు బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ పని పూర్తైన తర్వాత జెంటిల్‌మేన్ ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇస్తారు.అంతేగానీ.. అక్కడ మిగిలి ఉన్న సమయాన్ని మైలురాళ్లను చేరుకునేందుకు ఉపయోగించుకోకూడదు. అయితే, నిబంధనల ప్రకారం వారు తమ పని పూర్తి చేసుకోవచ్చు. కానీ చూడటానికి ఇది అంత గొప్పగా కనిపించదు.ఒకవేళ నిజంగానే వాళ్లు సెంచరీలు పూర్తి చేయాలనుకుంటే ముందు నుంచే ఎందుకు వేగంగా ఆడలేదు. చివరి సెషన్.. చివరి గంట వరకూ ఎందుకు నెమ్మదిగానే ఆడారు. డ్రా కోసమే వారు అలా చేశారు. మరి అలాంటప్పుడు ఒక జట్టునే నిందించడం దేనికి?’’ అని ప్రశ్నించాడు. ‘నేను’ అనే స్వార్థానికి తావుండదుఇందుకు.. ‘‘ఇరుజట్లకూ తమ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఒకవేళ బ్యాటర్‌ను ఫీల్డ్ బయటకు పంపించాలంటే అవుట్ చేయవచ్చు కదా!’’ అంటూ షంసీ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. ‘‘చివరి గంట వ్యక్తిగత మైలురాళ్లను చేరుకోవడానికి కేటాయించింది కాదు. జట్టులో ‘నేను’ అనే స్వార్థానికి తావుండదు. ఒకవేళ నేనే అక్కడ 90 పరుగులతో ఉండి ఉంటే కచ్చితంగా డ్రాకు అంగీకరించేవాడిని’’ అని స్టెయిన్ బదులిచ్చాడు. చదవండి: నా కొడుకు ఏమి తప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్ తండ్రి ఫైర్ -
నా కొడుకు ఏమి తప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్ తండ్రి ఫైర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించడంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో సుందర్ తన విరోచిత పోరాటంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ తమిళనాడు ఆటగాడు మొత్తంగా 206 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సుందర్‌పై అందరూ ప్రంశసల వర్షం కురిపిస్తుంటే.. అతడి తండ్రి మణి సుందర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు నిలకడగా రాణిస్తున్నప్పటికి, జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని భారత సెలక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు"వాషింగ్టన్ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. కానీ వాషీకి పెద్దగా గుర్తింపు లభించలేదు. భారత జట్టు అభిమానులు సైతం సుందర్ ప్రదర్శనలను గుర్తించడం లేదు. మిగితా ఆటగాళ్లు బాగా ఆడకపోయినా, వారికి క్రమం తప్పకుండా అవకాశాలు లభిస్తున్నాయి. నా కొడుకు మాత్రం బాగా ఆడిన కూడా రెగ్యూలర్‌గా ఛాన్స్‌లు లభించలేదు. నాలుగో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చినట్లగానే మిగితా మ్యాచ్‌లలో కూడా అదే పొజిషన్లో అతడిని పంపాలి. వరుసగా 10 మ్యాచ్‌లలో నా కుమారుడిని ఆడించాలి. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో వాషీకి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సెలక్టర్లు అతడి ప్రదర్శలనపై ఓ కన్నేసి ఉంచాలి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంమ్ సుందర్ పేర్కొన్నాడు.2021లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సుందర్.. ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 12 మ్యాచ్‌లలో 44.87 సగటుతో 673 పరుగులు చేసిన వాషీ.. 32 వికెట్లు కూగా పడగొట్టాడు.చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’ -
గిల్‌పై విమర్శలు.. గంభీర్ కౌంటర్!.. పంత్‌ను ఎంత పొగిడినా తక్కువే!
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. గతంలో గిల్‌పై విమర్శలు చేసినవారిని గంభీర్ తప్పు పట్టాడు. ‘గిల్ ప్రతిభ విషయంలో ఎప్పుడూ ఎలాంటి సందేహాలు లేవు. అతడిని విమర్శిస్తున్నవారికి క్రికెట్ గురించే తెలియకపోవచ్చు. అతడి ప్రదర్శన మాకు ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అతడిపై కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేదని తేలిపోయింది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పోరాట పటిమ కారణంగా ఇది సాధ్యమైంది. మేము ఇంకా 1–2తో వెనుకబడే ఉన్నాంఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత బ్యాటర్లు కనబర్చిన పోరాటపటిమను కెప్టెన్ గిల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అయితే ఈ డ్రాతో ఏదో సాధించామని భావించడం లేదని, తర్వాతి పోరులో గెలిచేందుకు ప్రయత్నిస్తామని అతను అన్నాడు.‘నేను ‘డ్రా’ కంటే మ్యాచ్‌లో ఫలితం రావడాన్నే ఇష్టపడతా. మేం ఇంకా 1–2తో వెనుకబడి ఉన్నామనే విషయం మర్చిపోలేదు. దీనిని 2–2గా మార్చడం అవసరం. మా ఆటగాళ్లకు తగినంత అనుభవం లేకపోయినా ప్రస్తుతం ఇది మా ఉత్తమ జట్టు. వీరంతా ఎవరో ఒకరిని అనుకరించడం కాకుండా తామే కొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని పేర్కొన్నాడు. మరో వైపు.. ఓవల్ మైదానంలో జరిగే చివరి టెస్టులో శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్ వచ్చే అవకాశాలున్నాయి.పంత్‌పై ప్రశంసలుగాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు సిరీస్‌లో మిగిలిని ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడని అందరికీ తెలుసు.అయితే, జట్టు నిర్మాణంలో పంత్ వంటి పట్టుదల కలిగిన ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశం కోసం, జట్టు కోసం రిషభ్ ఏం చేశాడో అందరమూ చూశాం కదా! అతడిని ఎంత పొగిడినా తక్కువే. వేలు విరిగినా అతడు బ్యాటింగ్ చేశాడు.పంత్‌లా అందరికీ ఇలాంటివి సాధ్యం కావు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ నేనున్నానంటూ తను ముందుకు వచ్చాడు. టెస్టు జట్టులో పంత్ అత్యంత ముఖ్యమైన సభ్యుడు. అతడు త్వరలోనే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం -
గాయంపై అప్డేట్.. ఫొటోలు షేర్ చేసిన పంత్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన గాయంపై అప్డేట్ అందించాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తన కాలి గాయం తాలూకు ఫొటోలు షేర్ చేసిన పంత్.. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.2022లో జరిగిన కారు ప్రమాదంలో అదృష్టవశాత్తూ.. ప్రాణాపాయం నుంచి బయటపడిన పంత్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. టీమిండియా తరఫున పునరాగమనంలోనూ అదరగొడుతున్నాడు.479 పరుగులుతాజాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) టెస్టు సిరీస్‌లోనూ పంత్ సత్తా చాటాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 479 పరుగులు సాధించాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు (134, 118)బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (65)తో సత్తా చాటాడు.బొటనవేలు ఫ్రాక్చర్ఇక లార్డ్స్ మైదానంలోనూ హాఫ్ సెంచరీ(74) బాదిన పంత్.. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడినప్పటికీ వీరోచిత అర్ధ శతకం (54)తో మెరిశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన పంత్.. కుడికాలి బొటనవేలికి బంతి బలంగా తాకింది. దీంతో కాలు ఉబ్బిపోవడంతో పాటు.. బొటనవేలు ఫ్రాక్చర్ అయింది.ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. జట్టు అవసరాల దృష్ట్యా తిరిగి బ్యాటింగ్ దిగాడు. మరో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్ పోరాట పటిమ కారణంగానే తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేయగలిగింది టీమిండియా.అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసి సవాలు విసరగా.. భారత్ ఐదో రోజు ఆఖరి సెషన్ వరకు అద్భుతంగా పోరాడి.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక వేలి నొప్పి కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నారాయణన్ జగదీశన్‌కు బీసీసీఐ పిలుపునిచ్చింది.ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం అదేఇదిలా ఉంటే.. తన గాయం గురించి స్పందిస్తూ.. ‘‘నేను త్వరగా కోలుకోవాలంటూ నా శ్రేయోలాభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిజానికి నేను దృఢంగా ఉండటానికి మీ ప్రేమాభిమానాలే కారణం.గాయం పూర్తిగా నయమైన తర్వాత నేను రిహాబిలిటేషన్ మొదలుపెడతాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రక్రియ ప్రారంభిస్తాను. ఓపికగా ఎదురుచూస్తూ.. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతాను.దేశం కోసం ఆడటమే నా జీవితంలోని అత్యంత ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పంత్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో గిల్ సేన 1-2తో వెనుకబడి ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా 2-2తో సిరీస్ సమం చేయగలుగుతుంది.చదవండి: IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’ 🙌#RP17 pic.twitter.com/LlAZ7lJKDm— Rishabh Pant (@RishabhPant17) July 28, 2025 -
మాంచెస్టర్ టెస్ట్ హీరోలు.. కేఎల్ రాహుల్‌కు క్రెడిట్ ఇవ్వని ఎల్ఎస్జీ
మాంచెస్టర్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్న టీమిండియా హీరోలు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులు, విశ్లేషకులు, వారు, వీరు అన్న తేడా లేకుండా అందరూ పై నలుగురిని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) న భూతో న భవిష్యతి అన్న రీతిలో బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు.పై నలుగురిలో గిల్, జడ్డూ, సుందర్ సెంచరీలు చేయగా.. రాహుల్ తృటిలో ఆ మార్కును చేజార్చుకున్నాడు. స్టోక్స్ అద్బుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాహుల్ మూడంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయాడు. రాహుల్ సెంచరీ చేయకపోయినా, చారిత్రక ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లండ్ గెలుపును అడ్డుకునేందుకు తొలి మెట్టు పేర్చాడు.అంకెల విషయాన్ని పక్కన పెడితే సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గిల్‌తో పాటు రాహుల్ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోతుంది. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడన్న విషయం తప్పించి, సెంచరీలు చేసిన గిల్, జడ్డూ, సుందర్‌తో పాటు రాహల్‌ను కూడా వేనోళ్ల పొగడాల్సిందే.The men who made it happen 🫡 pic.twitter.com/6zST20o0Dp— Lucknow Super Giants (@LucknowIPL) July 28, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్లో రాహుల్ మాజీ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం అతని ఇన్నింగ్స్‌ను విస్మరించి, మిగతా ముగ్గురికి క్రెడిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇవాళ (జులై 28) ఉదయం ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలను నుంచి పోస్ట్ చేస్తూ.. The men who made it happen అంటూ గిల్, జడ్డూ, సుందర్‌కు మాత్రమే క్రెడిట్ ఇచ్చింది. ఇందులో రాహుల్ ప్రస్తావన లేకపోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. రాహుల్ అంటే ఎందుకంత చిన్న చూపు అంటూ ఎల్ఎస్జీకి అక్షింతలు వేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మ్యాచ్ భారత్ నుంచి చేజారకుండా ఉండటంలో రాహుల్‌ది కూడా ప్రధానపాత్ర అని అతని అభిమానులు అంటున్నారు. కాగా, ఎల్ఎస్జీ యాజమాన్యానికి రాహుల్ విషయంలో ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. రాహుల్ తమ ఫ్రాంచైజీని వదిలి ఢిల్లీకి వెళ్లాడన్న అక్కసుతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తుంటుంది. -
IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
టీమిండియా క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), రవీంద్ర జడేజాలపై భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. లార్డ్స్ (Lord's Test), మాంచెస్టర్ టెస్టుల్లో ఈ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. నాలుగో టెస్టులో సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీరిద్దరు అర్హులని.. వారి స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఉన్నా అదే పని చేసేవారన్నాడు.ఊహించని రీతిలో పుంజుకునిభారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నుంచి ఆదివారం వరకు నాలుగో టెస్టు జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఏకంగా 669 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.గిల్‌తో పాటు జడ్డూ, వాషీ శతకాలుఇలాంటి తరుణంలో నాలుగో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (103) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. జడ్డూ (107), వాషీ (101) ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకూ పట్టుదలగా నిలబడి అజేయ శతకాలతో మ్యాచ్ డ్రా అయ్యేలా చూశారు.రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడుఈ నేపథ్యంలో వాషీ, జడ్డూలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వాషింగ్టన్ సుందర్ గబ్బా మైదానంలో టీమిండియా టెస్టు గెలిచిన తర్వాత తన పెంపుడు కుక్కకు గబ్బాగా నామకరణం చేశాడు.ఇక ఇప్పుడు.. అతడు మరో రెండు కుక్కలను కొని... వాటికి లార్డ్స్, మాంచెస్టర్ అనే పేర్లు పెడితే బాగుంటుంది. ఇక రవీంద్ర జడేజా రెండు గుర్రాలు తెచ్చి వాటికి ఈ పేర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే.. అతడికి డాగ్స్‌తో వర్కౌట్ కాదు మరి’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా జడేజాకు గుర్రపు స్వారీ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. లార్డ్స్‌లో వాషీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జడ్డూ 61 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును భారీ ఓటమి నుంచి తప్పించాడు. అయితే, మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో ఆఖరికి 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.చావోరేవోఇక ఇంగ్లండ్- భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా... రెండింట స్టోక్స్ బృందం.. ఒక మ్యాచ్‌లో గిల్ సేన గెలిచాయి. నాలుగో టెస్టు డ్రా కావడంతో 2-1తో ఇంగ్లండ్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య జూలై 31- ఆగష్టు 4 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసి డ్రా చేసుకోగలుగుతుంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్ -
మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తీరుపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు ఇంగ్లండ్ జట్టు ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. టీమిండియా ఆటగాళ్ల స్థానంలో తమ ప్లేయర్లు ఉంటే కూడా స్టోక్స్ ఇలాగే చేసేవాడా అని ప్రశ్నించాడు. అసలేం విషయం ఏమిటంటే..ఆపేద్దాం.. లేదు ఆడేద్దాంభారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు (Ind vs Eng 4th Test)లో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఆఖరి గంటలో... ఆపేద్దామంటే, ఆడేద్దామనే హైడ్రామా చోటు చేసుకుంది. చివరి సెషన్లో ఇక గంట ఆటే మిగిలుంది. 15 ఓవర్లు పడాల్సి ఉంది. ఫలితం తేలని సందర్భాల్లో ఆ కనీస ఓవర్లకు ముందే ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర సమ్మతితో ‘డ్రా’ పాట పాడే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ భంగపడ్డాడు.స్టోక్స్‌కు మింగుడుపడని విధంగా అసలేం జరిగిందంటే... 138 ఓవర్లలో భారత్ స్కోరు 386/4. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మిగిలిపోయిన ఆ 15 ఓవర్లతో ఆలౌట్ చేయడం, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం, ఇంగ్లండ్ గెలవడం జరిగేది కాదని అర్థమైంది. దీంతో అలసిన సహచరులకు కాస్త ముందుగానే విశ్రాంతినిద్దామనే ఆలోచనతో స్టోక్స్ డ్రా కోసం ‘ఇక చాలు ఆపేద్దాం’ అన్నాడు.శతకాలు పూర్తి చేసుకున్న తర్వాతకానీ అవతలి వైపు జడేజా (89 బ్యాటింగ్), సుందర్ (80 బ్యాటింగ్) సెంచరీలకు దగ్గరవడంతో భారత దళం ‘కుదరదు... ఆడేద్దాం’ అంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా తోసిపుచ్చాడు. క్రీజులో ఉన్న ఇద్దరం శతకరేసులో ఉన్నామన్నాడు. దీంతో చేసేదేమీలేక చిన్నబుచ్చుకున్న స్టోక్స్ సులువైన బౌలింగ్‌నే పురమాయించాడు. ఫోరు, సిక్స్‌తో జడేజా... తర్వాత బౌండరీలతో సుందర్ చకచకా సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఈ ఆఖరి దూకుడుతో 5 ఓవర్ల వ్యవధిలో భారత్ 39 పరుగులు చేసింది. 400 స్కోరునూ దాటింది.మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?అయితే, ముందు జడ్డూ, వాషీల శతకాలకు అడ్డుపడేలా.. పదే పదే షేక్‌హ్యాండ్ ఇస్తూ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. ‘‘ఒకరేమో 90, మరొకరేమో 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు... సెంచరీ పూర్తి చేసుకునేందుకు వారు అర్హులా? కాదా?ఒకవేళ వారి ఆటగాళ్లు కూడా ఇలా మైలురాయికి చేరువైన వేళ ఇలాగే డ్రా ప్రతిపాదన తెచ్చేవారా? మా వాళ్లు పట్టుదలగా పోరాడారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలమే ఆ శతకాలు. ఎవరినో సంతోష పెట్టడానికి మేము ఇక్కడ లేము’’ అంటూ స్టోక్స్ తీరుపై గంభీర్ మండిపడ్డాడు.ఆఖరి టెస్టు గెలిస్తేనేకాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ జయభేరి మోగించింది. అయితే, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. తాజాగా మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్: 358 & 425/4👉ఇంగ్లండ్: 669.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాA day defined by three centurions as #ShubmanGill, #RavindraJadeja & #WashingtonSundar led #TeamIndia’s defiance & secured a draw! 🙌🏻Which moments did you enjoy the most? ✍🏻👇#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/5uLQZD24Cq— Star Sports (@StarSportsIndia) July 27, 2025 -
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
మాంచెస్టర్‌లో టీమిండియా అద్బుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత ఆటగాళ్లు తమ విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రాగా ముగించారు. దాదాపు రెండు రోజుల పాటు ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది మరి మ్యాచ్‌ను తమ చేజారకుండా కాపాడుకున్నారు.సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(103), కేల్ రాహుల్(90) తమ అద్బుత బ్యాటింగ్‌లతో ఆదుకోగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా(185 బంతుల్లో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 101 నాటౌట్) ఆజేయ శతకాలతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు.వీరిద్దరి అసమాన పోరాటానికి ఇంగ్లీష్ జట్టు ప్లేయర్లు తమ సహనాన్ని కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు, ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ డ్రా గా ముగియడంతో సిరీస్‌ను సమం చేసే అవకాశం టీమిండియాకు లభించింది. ఇక మాంచెస్టర్ టెస్టు డ్రా ముగియడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.తమ ఆటగాళ్ల అసాధారణ పోరాటంపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "కీలకమైన మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.నాలుగో రోజును కేఎల్ భాయ్, నేను జాగ్రత్తగా ఆడి ముగించాము. ఐదో రోజు పిచ్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. అందుకే ప్రతీ బంతిని కూడా జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాము. అందుకే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు..మేం ప్రతీ బంతిని ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను వీలైనంత ఆఖరివరకు తీసుకెళ్లాలనుకున్నాం. జడేజా, సుందర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ తమ సెంచరీలకు చేరువలో ఉన్నారు. వారు సెంచరీలు చేసేందుకు ఆర్హులు, అందుకే డ్రాను అంగీకరించేందుకు కరచాలనం చేయలేదు.ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు సాగింది. ఈ సిరీస్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. ప్రతీ టెస్టు మ్యాచ్ కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. మా ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాము.ప్రతీసారి కాస్త ఒత్తిడి..నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్ జెర్సీ ధరించి దేశం కోసం ఆడిన ప్రతీసారి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఆటను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తుంది.నేను బ్యాటింగ్ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటునాను. తొలి ఇన్నింగ్స్‌లో మేము మంచి స్కోర్ సాధించాము. కానీ మా బ్యాటర్లలో చాలా మంది తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లగా మలచడంలో విఫలమయ్యారు. ఇలాంటి వికెట్‌పై ఒకరిద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ మేము అలా చేయలేకపోయాము. ఇక బుమ్రా ఫిట్నెస్ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను. అదేవిధంగా మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి కూడా పట్టించుకోమని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లు:భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107 నాటౌట్, సుందర్ 101 నాటౌట్, క్రిస్ వోక్స్ 2/67)చదవండి: పోరాటం కూడా గర్వించేలా... -
జడేజా, సుందర్ వీరోచిత శతకాలు.. డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడింది.తొలుత కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా.. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు. సుందర్-జడేజా జోడీ ఐదో వికెట్‌కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కగా.. జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.నాలుగో టెస్ట్ డ్రా కావడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. -
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. నిలబడిందా అద్భుతమే..!
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివరి రోజు భారత్ తొలి సెషన్లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయింది.ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. రికార్డు సెంచరీ పూర్తి చేసిన వెంటనే శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్‌కు చేరాడు.జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. లంచ్ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. సుందర్ (21), రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. భారత్ 6 వికెట్లను నిలుపుకోవాలి. సుందర్, జడేజా తర్వాత పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఔటైతే భారత్ ఖేల్ ఖతం అయినట్లే.ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకునే అవకాశం లేదు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్- 223/4 (ఐదో రోజు లంచ్ విరామం సమయానికి) -
అతడు అరంగేట్రంలోనే 10 వికెట్లు తీస్తాడనుకున్నారా?: కపిల్ దేవ్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ గాయాల బారిన పడటంతో అనూహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన కాంబోజ్.. తన తొలి మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు.18 ఓవర్లు వేసిన కాంబోజ్ 89 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. తక్కువ స్పీడ్‌తో బంతులు వేయడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని ఓ ఆట ఆడేసికున్నారు.దీంతో అన్షుల్‌ను జట్టులోకి తీసుకున్న హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కాంబోజ్‌కు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో టెస్టు అరంగేట్రం చేసే ఆటగాడి నుంచి అభిమానులు ఎక్కువగా ఆశించకూడదని ఆయన అన్నారు."ఒక అరంగేట్ర ఆటగాడి నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? అతడు 10 వికెట్లు తీస్తాడని మీరు అనుకున్నారా? అతడి కెపాసిటీని మీరు అంచనా వేయండి. అందులో ఎటువంటి తప్పులేదు. అతడిలో అద్బతమైన స్కిల్స్ ఉంటే కచ్చితంగా తిరిగి పుంజుకుంటాడు. తొలి మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయర్‌పై నైనా ఒత్తిడి సహజంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అతడు మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చు. తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటాడని నమ్ముతున్నారు. ప్రతీ ఒక్కరిపై నమ్మకం అనేది ముఖ్యం. కేవలం ఒక్క మ్యాచ్‌తో ఎవరి టాలెంట్‌ను అంచనా వేయద్దు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.కాగా మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ భారత్‌ను కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ జోడీ ఆదుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 174 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది. -
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్(0), సాయిసుదర్శన్(0) పెవిలియన్‌కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజే భారత కథ ముగుస్తుందని అంతా భావించారు.కానీ కేఎల్ రాహుల్(87 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్(78 నాటౌట్) తమ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడగా నిలిచారు. వీరిద్దరూ 62 ఓవర్లు పాటు తమ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు.తొలి జోడీగాఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత థర్డ్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్-గిల్ జంట 49 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 రన్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. వీరికంటే ముదు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) పరుగులు చేశారు.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
ఇంగ్లండ్‌కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ సమయంలో జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(167 బంతుల్లో 78 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.టీమిండియా సవాల్ విసురుతుందా?కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.ఒకవేళ తొలి సెషన్లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ -
IND vs ENG: ముగిసిన నాలుగవ రోజు ఆట.. భారత్ స్కోరు ఎంతంటే..
Update: నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 87(210), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 78(167)తో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరి పోరాట పటిమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వంద పరుగుల మార్కు దాటింది. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నాలుగో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లు రాణించగా.. సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54) అర్ధ శతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇందుకు దీటుగా బదులిచ్చి ఏకంగా 669 పరుగులు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లు బజ్‌బాల్‌తో దుమ్ములేపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలు బాదారుఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. భారత రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగారు.టీమిండియా ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికి జైసూను, ఐదో బంతిని సాయిని ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ వెనక్కి పంపించాడు. ఇలా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయన భారత జట్టును కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి గిల్ 71, రాహుల్ 68 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. -
శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకం (52)తో మెరిశాడు. మాంచెస్టర్‌లో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 77 బంతుల్లో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో గిల్‌కు ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ.కాగా లీడ్స్‌లో శతక్కొట్టిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే, ప్రఖ్యాత లార్డ్స్' మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులే చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక మాంచెస్టర్ టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాబ్ 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 225 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు.ఇంగ్లండ్ 669కాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లతో పాటు సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54), శార్దూల్ ఠాకూర్ (41) రాణించారు.అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ సెంచరీలతో మెరిశారు. ఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
చరిత్ర సృష్టించిన స్టోక్స్!.. ఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన సారథుల సరసన చేరాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఫీట్ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టులో స్టోక్స్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (61), శుబ్‌మన్ గిల్ (12)ల రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చిన స్టోక్స్.. శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27), అన్షుల్ కంబోజ్ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.141 పరుగులుఅనంతరం బ్యాటింగ్‌లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇరగదీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్టోక్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు దాటాడు. మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్.. 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇవ్వడంతో స్టోక్స్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన కెప్టెన్లు వీరే🏏డెనిస్ అట్కిన్సన్ (వెస్టిండీస్)- 1955లో ఆస్ట్రేలియా మీద🏏గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 1966లో ఇంగ్లండ్ మీద🏏ముష్తాక్ మొహమ్మద్ (పాకిస్తాన్)- 1977లో వెస్టిండీస్ మీద🏏ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)- 1983లో టీమిండియా మీద🏏బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)- 2025లో టీమిండియా మీదఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఇదిలా ఉంటే.. 544/7 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ కాసేపటికే లియామ్ డాసన్ (26) వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ వికెట్‌ను జడేజా దక్కించుకున్నాడు. అదే విధంగా.. బ్రైడన్ కార్స్ (47)ను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులు స్కోరు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.భారత బౌలర్లలో జడ్డూ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్𝘾𝙖𝙡𝙢, 𝘾𝙤𝙤𝙡, 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣 🔥#BenStokes shows great composure, calmly facing 6 dot balls on 99 before finally reaching a well-earned century with a confident shot 🙌#ENGvIND 👉 4th TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/xkvCs073fI pic.twitter.com/TzhM6CBR6L— Star Sports (@StarSportsIndia) July 26, 2025 -
శతక్కొట్టిన బెన్ స్టోక్స్.. ఎనిమిదేళ్ల తర్వాత అలా!.. ఇప్పుడిలా..
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) శతక్కొట్టాడు. మాంచెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో రోజు ఆటలో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 34 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 164 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. కాగా స్టోక్స్‌కు ఇది టెస్టుల్లో పద్నాలుగవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండోది. ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మూడు టెస్టుల్లో రెండు గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.ఐదు వికెట్లతో చెలరేగిన గిల్ఇరుజట్ల మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా 358 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగి.. గిల్ సేనను దెబ్బకొట్టాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.మూడేళ్లలో తొలిసారి!అంతేకాదు.. అదే మ్యాచ్‌లో సెంచరీ కూడా కొట్టి స్టోక్స్ మాంచెస్టర్ టెస్టును మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. కాగా గత మూడేళ్లలో టెస్టుల్లో స్టోక్స్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం. నవతరం టాప్ ఆల్రౌండర్లలో ఒకడైన స్టోక్స్ ఈ టెస్టు ద్వారా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94) మెరుపు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. జో రూట్ 150 పరుగులతో అదరగొట్టాడు. తాజాగా కెప్టెన్ స్టోక్స్ కూడా సెంచరీతో చెలరేగగా.. 149 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 614 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా కంటే 256 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరైన వ్యూహాలు అమలు చేయడంలో విఫలమయ్యాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో బౌలర్ల సేవలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడంటూ పెదవి విరిచాడు. శుక్రవారం నాటి తొలి సెషన్లో స్పిన్నర్ల చేతికి బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది. మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే డ్రా కోసం టీమిండియా ప్రయత్నించడమే ఉత్తమంగా కనిపిస్తోంది.358 పరుగులకు ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 544 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సంపాదించింది.భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్టీమిండియా బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84), బెన్ డకెట్ (100 బంతుల్లో 94) మరోసారి ‘బజ్‌బాల్’ శైలిలో రెచ్చిపోయారు. మరోసారి జో రూట్ తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ రికార్డు శతకం (150)తో చెలరేగగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 నాటౌట్) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆతిథ్య జట్టుకు ఈ మేర ఆధిక్యం లభించింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్‌లో పదును తగ్గగా.. మహ్మద్ సిరాజ్‌తో పాటు అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ముగ్గురూ తలా ఒక వికెట్ దక్కించుకోగా.. ఇక శార్దూల్ ఠాకూర్ మరోసారి విఫలమయ్యాడు. అయితే, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదుఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ తీరుపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. ‘‘నేనే గనుక గిల్ స్థానంలో ఉండి ఉంటే.. స్పిన్నర్లతో రోజును ఆరంభించేవాడిని. కనీసం వారికి రెండు- మూడు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చేవాడిని.కానీ గిల్ అలా చేయలేదు. అందుకు కారణమేమిటో అతడే వివరించాలి. అతడు వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఇక దురదృష్టవశాత్తూ బుమ్రా కూడా ఈ పిచ్‌పై రాణించలేకపోయాడని.. సిరాజ్ మాత్రం ఫర్వాలేదనిపించాడన్నాడు. అదే విధంగా.. గంటకు 78- 81 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే శార్దూల్ ఠాకూర్ నుంచి ఇక్కడ మెరుగైన ప్రదర్శన ఆశించడం కూడా తప్పేనని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక అన్షుల్ కొత్త వాడని.. ఆదిలోనే అతడు అద్భుతాలు చేయలేడని పేర్కొన్నాడు. వీరందరితో నెగ్గుకురావడం కాస్త కష్టమేనంటూ ఒకానొక సందర్భంలో గిల్‌కు మద్దతు పలికాడు.చదవండి: AUS vs WI: టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?
మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కాంబోజ్ చెరో వికెట్ సాధించారు.బుమ్రాకు ఏమైంది?ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. అతడు తన తొలి వికెట్ అందుకోవడానికి 23 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమి స్మిత్‌ను ఔట్ చేసి మొదటి వికెట్‌ను సాధించాడు. అస్సలు ఈ మ్యాచ్‌లో మనం చూస్తుంది బుమ్రానేనా అన్నట్లు అతడి బౌలింగ్ సాగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సునాయసంగా అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఇటువంటి బౌలింగ్‌ను బుమ్రా నుంచి చూడలేదు.ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే తనను తాను సరిదిద్దుకోవడానికి ఒకటి లేదా రెండు ఓవర్లు కంటే ఎక్కువ సమయం పట్టదు. ఏమైందో కానీ మాంచెస్టర్‌లో మాత్రం తన మార్క్‌ను ఈ స్పీడ్ చూపించలేకపోతున్నాడు. ఎక్కువగా డౌన్ ది లెగ్ బంతులు వేసి పరుగులు ఇవ్వడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడం వంటి తప్పులు చేశాడు.ఒకే ఒక్కసారి..ముఖ్యంగా మాంచెస్టర్‌లో బుమ్రా పేస్ జనరేట్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. ఈ గుజరాత్ స్పీడ్ స్టార్ సాధరణంగా టెస్టుల్లో గంటకు 138- 140 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే 140 ప్లస్ వేగంతో బౌలింగ్ చేశాడు.ఇప్పటివరకు నో బాల్స్‌తో కలిపి 173 బంతులు బౌలింగ్ చేసిన బుమ్రా.. ఒకే ఒక్కసారి 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గాడు. అంతకుముందు లీడ్స్ టెస్టులో 266 బంతులు వేసిన బుమ్రా.. 39.84 శాతంతో 106 బాల్స్‌ను 140 కి.మీ పైగా వేగంతో సంధించాడు.ఆ తర్వాత లార్డ్స్‌లో కూడా 257 బంతుల్లో 69 బంతులను 140 కి.మీ పైగా వేగంతో వేశాడు. కానీ నాలుగో టెస్టులో మాత్రం సరైన పేస్‌తో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీంతో అతడి గాయం ఏమైనా తిరిగబెట్టిందా అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే టీమిండియా మెనెజ్‌మెంట్ ఈ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడించాలని నిర్ణయించింది. ఈ సిరీస్‌లో అతడికి ఇది మూడో మ్యాచ్. తొలి టెస్టులో ఆడిన బుమ్రా, రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి వచ్చిన బుమ్రా మూడో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు ఈ స్పీడ్ స్టార్ విశ్రాంతి ఇస్తారని అంతా భావించారు. కానీ కీలకమైన మ్యాచ్ కావడంతో మాంచెస్టర్‌లో అతడిని ఆడించారు. ఈ నిర్ణయం టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 28 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 95 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా బుమ్రా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: టెస్టు చేజారిపోతోంది! -
Fact Check: కరుణ్ నాయర్ నిజంగానే ఏడ్చాడా..?
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట సాగుతున్న వేల ఓ ఆసక్తికర ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ బాధపడుతూ (ఏడుస్తూ) ఉన్నట్లు కనిపించగా.. సహచరుడు కేఎల్ రాహుల్ అతన్ని ఓదారుస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫోటో సోషల్‌మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరలైంది. ఇది చూసి క్రికెట్ అభిమానులు కరుణ్‌ను నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు ఏడుస్తున్నాడంటూ, బాధలో ఉన్న అతన్ని అతని ఆప్తమిత్రుడు కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నాడంటూ ఊహించుకోవడం మొదలు పెట్టారు. దీనిపై ఫ్యాక్ట్ చేయగా అది నిజం కాదని తెలిసింది. వాస్తవానికి ఆ ఫోటో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా తీసిందని తేలింది. కరుణ్, రాహుల్ లార్డ్స్ బాల్కనీలో కూర్చున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు కరుణ్ ఏడుస్తున్నాడన్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.కాగా, కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేసి ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ కరుణ్ చేసిన ఓ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలైంది. ఎట్టకేలకు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక జట్టులో (నాలుగో టెస్ట్) స్థానం కోల్పోయాడు. కరుణ్ స్థానంలో మేనేజ్మెంట్ నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వగా అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బరిలోకి దిగి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో సాయి సుదర్శన్ భారత జట్టులో నంబర్-3 స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రచారం మొదలైంది. ఇది పరోక్షంగా కరుణ్ కెరీర్ ముగిసినట్లేనన్న సంకేతాలిస్తుంది. కెరీర్ ముగిసిపోయిందన్న బాధలో కరుణ్ ఏడుస్తున్నాడని అభిమానులు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి కరుణ్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా పెద్ద తప్పిదం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని మరో అవకాశం రావడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ సాయి సుదర్శన్ కూడా తదుపరి మ్యాచ్‌ల్లో విఫలమైనా కరుణ్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువకులతో పాటు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో స్థానంలో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ కెరీర్ ముగిసిందనే చెప్పుకోవాలి.ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసేసింది. రూట్ రికార్డు సెంచరీతో ఆ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసి 141 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ 150, జేమీ స్మిత్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 భారత ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్ క్రికెటర్లు వీరే!
ఇది టీ20ల జమానా.. కో...డితే బంతి బౌండరీ దాటాల్సిందే.. పొట్టి ఫార్మాట్లో ఫోర్లు, సిక్సర్లు సులువుగానే కొట్టేయవచ్చు. కానీ టెస్టుల్లో సిక్స్ బాదడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సంప్రదాయ ఫార్మాట్లో ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా మాత్రమే సరిగ్గా షాట్‌ను కనెక్ట్ చేసి టెస్టుల్లో సిక్స్‌లు బాదగలరు. అప్పట్లో ఆడం గిల్‌క్రిస్ట్, వీరేందర్ సెహ్వాగ్, బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్ (Chris Gayle) అలవోకగా సిక్సర్లు కొడితే.. తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కూడా తమదైన షాట్లతో అలరించారు.కాలానికి అనుగుణంగా పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతున్న వేళ ప్రస్తుతం డిఫెన్స్ షాట్లకు బదులు దూకుడుగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్ల సంఖ్య పెరుగుతోంది. టెస్టు క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా యువ తరంగాలు రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ విధ్వంసకర షాట్లతో వీరూ, రోహిత్, ధోనిల సిక్సర్ల వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వీరికి పోటీనిస్తున్నాడు.సెహ్వాగ్ రికార్డు సమం చేసిన పంత్అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా సిక్సర్ల రికార్డులో పంత్ సెహ్వాగ్‌ను సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్.. రెండో టెస్టులో భారత్ గెలిచాయి.ఇక కీలకమైన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినా టీమిండియాకు ఓటమే ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. గాయం వేధిస్తున్నాఅయితే, తొలి రోజు ఆటలో గాయపడిన పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి.. రెండో రోజైన గురువారం తిరిగి వచ్చి మరో 17 పరుగులు సాధించాడు. టీమిండియా మెరుగైన స్కోరు చేయడంలో పంత్ అర్ధ శతకం కూడా కీలకం.మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్న పంత్.. 54 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్లో బాదిన సిక్సర్‌తో పంత్ సెహ్వాగ్ రికార్డును సమం చేయడం విశేషం. అయితే మ్యాచ్‌ల పరంగా చూస్తే సెహ్వాగ్ కంటే పంత్ ముందే ఈ మైలురాయిని చేరుకున్నాడు.Rishabh-Panti Max! 🔥😎They tried to hit him where it hurts... Pant responds by hitting it out of the park! Toughness has a new name @RishabhPant17 🙌🏻#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/6a2zPCQsr5— Star Sports (@StarSportsIndia) July 24, 2025 టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్-10 క్రికెటర్లు వీరే🏏1.రిషభ్ పంత్- 47 మ్యాచ్‌లలో కలిపి 90 సిక్సర్లు*🏏2. వీరేందర్ సెహ్వాగ్- 103 మ్యాచ్‌లలో కలిపి 90 సిక్సర్లు🏏3.రోహిత్ శర్మ- 67 మ్యాచ్‌లలో కలిపి 88 సిక్సర్లు🏏4. మహేంద్ర సింగ్ ధోని- 90 మ్యాచ్‌లలో కలిపి 78 సిక్సర్లు🏏5. రవీంద్ర జడేజా- 84 మ్యాచ్‌లలో కలిపి 74 సిక్సర్లు🏏6. సచిన్ టెండుల్కర్- 200 మ్యాచ్‌లలో కలిపి 69 సిక్సర్లు🏏7. కపిల్ దేవ్- 131 మ్యాచ్‌లలో కలిపి 61 సిక్సర్లు🏏8. సౌరవ్ గంగూలీ- 113 మ్యాచ్‌లలో కలిపి 57 సిక్సర్లు🏏9. శుబ్‌మన్ గిల్- 36 మ్యాచ్‌లలో కలిపి 43 సిక్సర్లు🏏10. హర్భజన్ సింగ్- 103 మ్యాచ్‌లలో కలిపి 42 సిక్సర్లు.👉కాగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 23 టెస్టుల్లోనే ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అతడు ఈ రికార్డు జాబితాలో టాప్-10లోకి చేరుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!? -
ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!?
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair)కు చేదు అనుభవమే మిగిలింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. సత్తా చాటలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)తో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. మొదటి ప్రయత్నంలోనే డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేయలిగిన 33 ఏళ్ల కరుణ్.. రెండో టెస్టులోనూ తేలిపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వరుసగా 31, 26 పరుగులు చేశాడు. లార్డ్స్ టెస్టులో మాత్రం అతడు కాస్త ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చి 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు.పాత కథే పునరావృతంరెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పాత కథే పునరావృతం. కేవలం 14 పరుగులే చేసి కరుణ్ నాయర్ నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికే మూడు అవకాశాలు ఇచ్చినా కరుణ్ తనను తాను నిరూపించుకోలేకపోయాడని.. ఇకనైననా అతడి స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.వేటు పడిందిఅందుకు తగ్గట్లుగానే నాలుగో టెస్టులో కరుణ్ నాయర్‌పై వేటువేసిన యాజమాన్యం.. సాయి సుదర్శన్‌కు పిలుపునిచ్చింది. మాంచెస్టర్ మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకున్నాడు. 151 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. తద్వారా భారత తొలి ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఒకవేళ సాయి ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటే.. కరుణ్ నాయర్‌కు చెక్ పడిందనే చెప్పవచ్చని నవజ్యోత్ సింగ్ సిద్ధు వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఏడ్చేసిన కరుణ్ .. ఓదార్చిన రాహుల్.. బ్లూ జెర్సీ వేసుకున్న కరుణ్ నాయర్ ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుండగా.. టీమిండియా ఓపెనర్, కరుణ్ చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ అతడి ఓదారుస్తున్నట్లుగా ఉంది. ఇది చూసిన అభిమానులు కరుణ్ నాయర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక గుడ్‌బై!?కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడింది. నాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు విరాట్ కోహ్లిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఫొటోలతో.. కరుణ్ ఫొటో పోలుస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే అశూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో గురువారం నాటి రెండో ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్ -
IND vs ENG: మనోడు.. అప్పుడే స్టోక్స్ అయిపోలేదు.. ఇదేం పిచ్చి?
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు (Ind vs Eng)లో టీమిండియా తడబడుతోంది. బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. గురువారం నాటి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఒక్క సెషన్లోనే 148 పరుగులు చేయడం ఇందుకు నిదర్శనం. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (13 ఓవర్లలో 37 రన్స్) వికెట్ తీసేందుకు విఫలయత్నం చేయగా.. మహ్మద్ సిరాజ్ (10 ఓవర్లలో 58) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.మరోవైపు.. అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ (Anshul Kamboj) పరుగులు ఇచ్చుకున్నా ఎట్టకేలకు.. బెన్ డకెట్ (100 బంతుల్లో 94) రూపంలో తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్నాడు. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (8 ఓవర్లలో 37) కూడా వికెట్ తీసి సత్తా చాటాడు.శార్దూల్ ఠాకూర్ మరోసారి..అయితే, బ్యాటింగ్‌లో డెప్త్ కోసమంటూ మరోసారి జట్టులోకి తీసుకున్న పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur).. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ బౌలింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఐదు ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించేసుకున్నాడు.భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 225 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ విభాగం గురించి భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ డెప్త్ పిచ్చిలో పడి మేనేజ్మెంట్ తప్పుల మీద తప్పులు చేస్తోందంటూ విమర్శించాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడాన్ని తప్పుబట్టాడు.‘‘ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉందని ఓ ఆటగాడిని తీసుకుంటే మీకు 20- 30 అదనపు పరుగులు రావొచ్చు. కానీ అదే ప్లేయర్‌కు బదులు 2- 3 వికెట్లు తీయగల బౌలర్‌ను తీసుకుంటే.. అది టెస్టు స్వరూపాన్నే మార్చివేస్తుంది.మనోడు.. అప్పుడే స్టోక్స్ అయిపోలేదులార్డ్స్, బర్మింగ్‌హామ్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కానీ ఏం జరిగింది? అతడు ఇప్పుడే బెన్ స్టోక్స్ స్థాయికి చేరుకోలేడు కదా!ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే.. నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమైన తర్వాత.. మరో ఆలోచనకు తావు లేకుండా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. బుమ్రా పనిభారం గురించి కాస్త పక్కనపెడితే.. కుల్దీప్ ఉంటే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.ఇదేం పిచ్చి?ఏదేమైనా తొలి నాలుగు టెస్టుల్లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం నాకైతే ఆశ్చర్యంగా ఉంది. 20 నుంచి 30 అదనపు పరుగుల కోసం బ్యాటింగ్ డెప్త్ అనే పిచ్చిలో పడిపోతున్నాం’’ అంటూ అశ్విన్ నాయకత్వ బృందంలో భాగమైన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ల తీరును ఘాటుగా విమర్శించాడు.కాగా రెండో టెస్టులో కేవలం రెండు పరుగులే చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో 43 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. మూడు వికెట్లు తీయగలిగాడు. మోకాలి గాయం కారణంగా నాలుగు, ఐదో టెస్టులకు అతడు దూరమయ్యాడు.చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్ -
మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. గాయపడినా జట్టు ప్రయోజనాల కోసం అతడు పోరాడిన తీరు అమోఘమని కొనియాడాడు. అయినా.. మరణాన్నే జయించిన వాడు ఇలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలకు తలవంచడంటూ ఆకాశానికెత్తాడు.చావోరేవోటెండుల్కర్- ఆండర్సర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలైంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు ఆటలో భాగంగా నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిఅయితే, మొదటి రోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా పంత్.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో పొరపడగా.. అది పంత్ కుడికాలి పాదాన్ని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్కానింగ్‌లో అతడి బొటనవేలు ఫ్యాక్చర్ అయిందనే వార్తలు వచ్చాయి.హాఫ్ సెంచరీతో మెరిసిఈ నేపథ్యంలో పంత్ మళ్లీ తిరిగి బ్యాటింగ్‌కు రాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు రెండో రోజు మైదానంలో దిగాడు. కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అర్ధ శతకం (54) బాది పెవిలియన్ చేరాడు. తన పాత స్కోరుకు మరో పదిహేడు పరుగులు జత చేసి వెనుదిరిగాడు.తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పంత్ పోరాటపటిమ, ఆట పట్ల అతడి అంకితభావం గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అనిల్ భాయ్‌ను గుర్తు చేశాడు‘‘రిషభ్ పంత్ పట్టుదల గురించి తప్పక మాట్లాడాలి. అతడు నాకు అనిల్ (కుంబ్లే) భాయ్‌ను గుర్తు చేశాడు. ఆంటిగ్వాలో తన దవడ విరిగినా బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అప్పుడు అది అవసరం లేదు. కానీ ఆయన ఆ వికెట్ తీసి మరీ సత్తా చాటాడు.ఇక ఇప్పుడు రిషభ్ పంత్.. కనీసం నడవలేకపోతున్నాడు. అయినా సరే మళ్లీ మైదానంలో దిగాడు. MRI స్కాన్, ఎక్స్-రే పూర్తయ్యాయి. అతడు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడనే వార్తలు వచ్చాయి.మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?ఈ ఒక్క మ్యాచ్ కాదు.. అతడు సిరీస్ మొత్తానికి దూరమవుతాడని అనుకున్నారంతా! కానీ అతడు తిరిగి వచ్చాడు. మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?.. ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు పంత్ లాంటి పోరాట యోధుడు తలవంచుతాడా?’’ అంటూ ఆకాశ్ చోప్రా పంత్‌ను ప్రశంసించాడు. కాగా 2022, డిసెంబర్లో పంత్ పెను ప్రమాదం నుంచి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు నడుస్తాడా? లేదా? అన్న సందేహాల నడుమ.. రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా మునుపటి కంటే మెరుగ్గా ఆడుతూ అద్భుతాలు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టులో భారత బ్యాటర్లు ఫరవాలేదనిపించినా.. బౌలర్లు తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 46 ఓవర్లలో 225 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 133 పరుగులు మాత్రమే వెనుకబడి ఉండగా.. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్A knock for the ages! 💪#RishabhPant returned after being retired hurt and showed the world what true grit looks like.How would you rate Rishabh Pant’s comeback knock? 👇#ENGvIND 👉 4th TEST, DAY 3 | FRI, 25th JUL, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/QsDlwZkIbc— Star Sports (@StarSportsIndia) July 24, 2025 -
సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ తనదైన శైలిలో ‘బజ్‌బాల్’ ఆటతో చెలరేగింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (Zak Crawley), బెన్ డకెట్ (Ben Ducket) దూకుడైన బ్యాటింగ్‌తో దుమ్ములేపారు. క్రాలీ 113 బంతుల్లోనే 84 పరుగులు చేయగా.. డకెట్ కేవలం 100 బంతుల్లోనే 94 పరుగులతో అలరించాడు. వన్డే మాదిరి బ్యాటింగ్ చేసిన వీరిద్దరిని ఆపడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు.దీంతో ఒక్క సెషన్లోనే ఏకంగా 148 పరుగులు చేసిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ విమర్శలు గుప్పించాడు.సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా?అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ముందుగానే బంతి ఇచ్చి గిల్ తప్పు చేశాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను కాదని అన్షుల్‌ను రంగంలోకి దించినందుకు భారత్ భారీ మూల్యమే చెల్లించిందన్నాడు.మరోవైపు.. బుమ్రా సైతం వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయలేకపోయాడని పాంటింగ్ విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లు తడబడ్డారు. సిరాజ్‌ను కాదని అన్షుల్ కంబోజ్‌కు కొత్త బంతిని ఇచ్చి తప్పు చేశారు. అతడిని ముందే రంగంలోకి దించడం నాకైతే నచ్చలేదు.బుమ్రాకు ఏమైంది?డకెట్ కొట్టిన తొలి ఐదు బౌండరీలలో తొలి సిక్సర్ స్క్వేర్ లెగ్ మీదుగానే వచ్చింది. టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. ముఖ్యంగా బుమ్రా స్టాతమ్ ఎండ్ నుంచి కాకుండా ఆండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసి పొరపాటు చేశాడు. నిజానికి ముందు కూడా స్టాతమ్ ఎండ్ నుంచే ఎక్కువ వికెట్లు పడ్డాయి’’ అంటూ పాంటింగ్ గిల్, బుమ్రా తీరును విమర్శించాడు.ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్లుకాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 264/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ఇందుకు ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి కేవలం రెండు వికెట్ల నష్టపోయి 46 ఓవర్లలోనే 225 పరుగులు చేసింది. క్రాలీని రవీంద్ర జడేజా అవుట్ చేయగా.. డకెట్ వికెట్‌ను అన్షుల్ దక్కించుకున్నాడు. ఓలీ పోప్ 20, జో రూట్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.#AnshulKamboj, welcome to Test cricket!Opens his wicket tally in style by removing a well-set Ben Duckett. 💥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/aXAsyVjKjw— Star Sports (@StarSportsIndia) July 24, 2025 ఇక భారత బౌలర్లలో గురువారం బుమ్రా 13 ఓవర్లలో 37 పరుగులు, అన్షుల్ 10 ఓవర్లలో 48, సిరాజ్ 10 ఓవర్లలో 58 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 5 ఓవర్లలోనే 35 పరుగులు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’ -
IND vs ENG: అప్పుడు కుంబ్లే.. ఇప్పుడు పంత్!
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు తడబడతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 225 పరుగులు స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ(84), బెన్ డకెట్(94) దంచికొట్టారు.ప్రస్తుతం క్రీజులో జో రూట్(11), ఓలీ పోప్(20) ఉన్నారు. భారత బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఒక్క వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.రిషబ్ విరోచిత పోరాటం..కాగా ఈ మ్యాచ్ తొలి రోజే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడటంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్ సంధించిన బంతి పంత్ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.తదనంతరం స్కానింగ్‌లో బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్‌పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్‌కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్ పంత్ క్రీజ్‌లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడటం వల్లే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను అవుట్ చేశాడు.చదవండి: వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌కు టీమిండియా -
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. రెండో రోజు ఆటలో భాగంగా మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur- 41) ఆరో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ కీపర్‌గా జురెల్ఇదిలా ఉంటే.. పంత్ బ్యాటింగ్‌కు వచ్చే కంటే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. జట్టు కోసం అతడు ఆడతాడని.. అయితే, ధ్రువ్ జురెల్ పంత్‌కు బదులు వికెట్ కీపింగ్ చేస్తాడని తెలిపింది.అయితే, అంతకు ముందు.. పంత్ ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమవుతున్నాడనే వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. పంత్ కుడికాలి బొటన వేలు ఫ్యాక్చర్ అయినందు వల్ల అతడు ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడంటూ..అంతేకాదు.. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడని తెలిపింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇషాన్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో అతడి సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ ఇటీవల స్కూటీ మీద నుంచి కిందపడ్డాడు.పది కుట్లు పడ్డాయిఅతడి చీలమండకు గాయమైంది. పది కుట్లు పడ్డాయి. ప్రస్తుతం కుట్లు తీసినా అతడి ఎడమ చీలమండకు ప్లాస్టర్ వేసే ఉంది. సెలక్టర్లు అతడిని గురువారం అతడిని సంప్రదించిన మాట నిజమే. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’’ అని వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. ఒకవేళ పంత్ గనుక ఐదో టెస్టుకు దూరమైతే నారాయణన్ జగదీశన్ అతడి స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని క్రిక్‌బజ్ పేర్కొంది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను టీమిండియాలో చేర్చడం దాదాపు ఖరారైపోయిందని వెల్లడించింది.కాగా ఇంగ్లండ్- ఇండియా మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికి మూడు పూర్తి కాగా ఆతిథ్య ఇంగ్లండ్ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య బుధవారం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మొదలైంది. ఈ క్రమంలో గురువారం నాటి భోజన విరామ సమయానికి టీమిండియా 105 ఓవర్లు పూర్తయ్యేసరికి.. ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అప్పటికి పంత్ 39, వాషింగ్టన్ సుందర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్ విడుదల -
రిషభ్ పంత్ అవుట్?.. జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమైనట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు నాలుగో టెస్టుతో పాటు ఐదో మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ-2025 (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌తో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ ఇప్పటి వరకు రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాల సాయంతో ఏకంగా 462 పరుగులు సాధించాడు.కాలికి గాయంఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ రిషభ్ పంత్ రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 48 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేశాడు.అయితే, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు పంత్ ప్రయత్నించగా.. అతడి కుడికాలి పాదానికి దెబ్బ తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.ఆరు వారాల విశ్రాంతితాజా సమాచారం ప్రకారం.. పంత్ కుడికాలి బొటన వేలు ఫ్యాక్చర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గాయం తీవ్రత దృష్ట్యా అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మాంచెస్టర్ టెస్టుతో పాటు.. లండన్‌లో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టుకూ అతడు దూరం కానున్నాడు.జట్టులోకి ఊహించని ప్లేయర్!బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాయి. ‘‘పంత్ ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటాడు. అతడి స్థానంలో కవర్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా రిషభ్ పంత్‌తో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ప్రస్తుతం జట్టులో ఉన్నాడు. ఇటీవల లార్డ్స్ టెస్టు సందర్భంగా పంత్ వేలికి గాయమైనపుడు అతడు కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, తాజాగా పంత్ పూర్తిగా దూరం కావడంతో జురెల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ఇక ఇషాన్ కిషన్ ఇంత వరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. 2023లో సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వ్యక్తిగత కారణాలు చూపుతూ టూర్ మధ్యలోనే భారత్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీల్లో ఆడేందుకు కూడా విముఖత చూపాడు. ఈ నేపథ్యంలో అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసిన బోర్డు.. ఇంతవరకు మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఇషాన్ ఆ తర్వాత రంజీలతో పాటు దులిప్ ట్రోఫీ ఆడాడు. ఈ క్రమంలో, ఈ ఏడాది అతడి కాంట్రాక్టును పునరుద్ధరించారు. ఇక ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఇషాన్ మెరిశాడు.చదవండి: అతడు ఫిట్‌గానే ఉన్నాడు కదా.. అన్షుల్‌ను ఎలా తీసుకున్నారు? -
వన్‌డౌన్‌లో సరైనోడు: మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan)పై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ (Navjot Singh Sidhu) సిద్ధు ప్రశంసల వర్షం కురిపించాడు. భారత టెస్టు జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు అతడే సరైనోడని కొనియాడాడు. సాయి టెక్నిక్ అద్భుతమని.. జట్టులో స్థానం కోసం జరిగే రేసులో అతడే ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాడని పేర్కొన్నాడు.అత్యధిక పరుగుల వీరుడుకాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టాడు సాయి సుదర్శన్. మొత్తంగా 15 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 759 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటికే వన్డే, టీ20లలో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు.సాయిపై వేటు వేసి..ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్.. మూడో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 30 పరుగుల చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడిని వేటు వేసి.. వన్‌డౌన్‌లో కరుణ్ నాయర్‌ను ఆడించింది.అర్ధ శతకంతో సత్తా చాటిఅయితే, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ టెస్టుల్లో కరుణ్ విఫలం కావడంతో.. మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టు సందర్భంగా సాయికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ క్రమంలో మరోసారి వన్‌డౌన్‌లో వచ్చిన సాయి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 151 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు.సరైనోడు వచ్చాడుఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఛతేశ్వర్ పుజారా స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వన్‌డౌన్‌లో ఎంతో మంది ఆటగాళ్లను పరిశీలించారు. ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు.పోటీపడే వారికి చుక్కలేటెస్టు క్రికెట్‌కు ఐపీఎల్ ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోలేము. కానీ.. టెక్నిక్‌పరంగా చూస్తే అతడు సరైన బ్యాటర్. జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ఆటగాళ్లకు అతడు నిద్రలేని రాత్రులు మిగల్చడం ఖాయం.సాయి సుదర్శన్ ఆటను చూసినప్పటి నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. వన్‌డౌన్ బ్యాటర్‌గా అతడు జట్టులో పాతుకుపోతాడు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు అభిప్రాయపడ్డాడు. సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో ఎలాంటి బలహీనతా కనిపించడం లేదని.. అదే అతడికి ఉన్న అతిపెద్ద బలం అని కొనియాడాడు.మెరుగ్గానే..కాగా ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ టెస్టులో బుధవారం నాటి తొలి రోజు ఆటలో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. 83 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా జయభేరి మోగించింది. అయితే, లార్డ్స్ టెస్టులో ఇరుజట్ల మధ్య ఊగిసలాడిన విజయం ఆఖరికి ఆతిథ్య జట్టును వరించింది. దీంతో ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉంది. మాంచెస్టర్‌లో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: IND vs ENG: టీమిండియా కెప్టెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. వరల్డ్ రికార్డు బద్దలు -
అతడు ఫిట్‌గానే ఉన్నాడు కదా.. అన్షుల్‌ను ఎలా తీసుకున్నారు?
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడ్డ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానాన్ని సీనియర్ శార్దూల్ ఠాకూర్‌తో భర్తీ చేసిన యాజమాన్యం.. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ను అరంగేట్రం చేయించింది.కరుణ్‌పై వేటుఇక వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు వేసిన సెలక్టర్లు.. తొలి టెస్టులో ఆడిన సాయి సుదర్శన్‌ను మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చేర్చారు. అయితే, ఈ తుదిజట్టు కూర్పుపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ విమర్శలు గుప్పించాడు. ఏ ప్రాతిపదికన అన్షుల్ కంబోజ్‌కు అవకాశం ఇచ్చారని ప్రశ్నించాడు.క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ వచ్చాడు. ఆకాశ్ దీప్ ఆడటం లేదు కాబట్టి.. అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేశాడు. ఇక శార్దూల్ ఠాకూర్ పునరాగమనం కూడా ఆసక్తికరమే.ప్రసిద్ ఫిట్‌గా ఉన్నాడుయువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయినప్పటికీ.. అకస్మాత్తుగా అతడిని పక్కనపెట్టారు. తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు.అన్షుల్ అరంగేట్రం ఎలా సాధ్యం?నిజానికి అన్షుల్ కంబోజ్ మొదటి నుంచి జట్టులో భాగమే కాదు. అతడి కంటే ముందు హర్షిత్ రాణా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. కొత్తగా వచ్చిన అన్షుల్ అరంగేట్రం చేశాడు.అసలు మేనేజ్మెంట్ ఆలోచన ఎలా ఉందో.. వారు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అంటూ మురళీ కార్తిక్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.సాయి సుదర్శన్‌పై ప్రశంసలుఅదే విధంగా.. సాయి సుదర్శన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తొలి రోజు ఆటలో అతడే హైలైట్. అతడు క్రీజులో ఉన్నపుడు వికెట్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేమీ లేదు. అయినా సరే సాయి అదరగొట్టాడు. అందుకే అతడు ప్రశంసలకు అర్హుడు’’ అని మురళీ కార్తిక్ కొనియాడాడు.తొలిరోజు మెరుగ్గానేకాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఇంగ్లండ్ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉండగా... మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) రాణించగా.. సాయి సుదర్శన్ అద్భుత అర్ధ శతకం(61)తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. రిషభ్ పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 19, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
నాకు ఇలానే జరిగింది.. అదే అయితే పంత్ ఆడడం కష్టమే: పాంటింగ్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు.బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. స్కాన్ రిపోర్ట్లు కోసం బీసీసీఐ వైద్య బృందం ఎదురు చూస్తోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే అది భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న పంత్.. ఈ మ్యాచ్‌తో పాటు ఆఖరి టెస్టు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు."రిషబ్ పంత్ కుడి కాలి పాదానికి బలంగా బంతి తాకింది. దెబ్బ తాకిన పంత్ తన కాలును నేలపై పెట్టలేకపోయాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం మైదానంలో లోపలికి వచ్చేముందు అతడు కొద్ది నిమిషాల పాటు అటు ఇటు తిరిగాడు. అయితే వెంటనే వాపు రావడం నాకు ఆందోళన కలిగించింది.గతంలో నాకు ఓ సారి ఇటువంటి గాయమే అయింది. పాదంలో చిన్న చిన్న పెళుసుగా ఉండే ఎముకలు ఉంటాయి. బంతి తాకడంతో అందులో ఒకట్రెండు విరిగిపోయాయి. అలా జరిగితే కాలు కింద పెట్టలేము. ఒకవేళ పంత్ విషయంలో అదే జరిగితే అతడు ఈ మ్యాచ్ నుంచి వైదొలగక తప్పదు. అలా అతడు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఒకవేళ తిరిగొచ్చిన ఇటువంటి రివర్స్ స్వీప్ షాట్లు ఆడడని నేను ఆశిస్తున్నా అని స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
తీవ్రమైన గాయమే.. పంత్ లేకపోతేనేం.. మిగిలిన వాళ్లు చాలు!
మాంచెస్టర్ టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బుధవారం నాటి ఆట ముగిసేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మొదటి రోజు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం రూపంలో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ-2025 (Tendulkar- Anderson Trophy)లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటికి ఏకంగా 462 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గాయపడిన పంత్తద్వారా ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుల స్థానంలో పంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టు సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు గాయమైంది.క్రిస్ వోక్స్ (Chris Woakes) సంధించిన బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడిపాదానికి తీవ్రమైన గాయమైంది. నొప్పి తట్టుకోలేక అతడు రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.పంత్ లేకపోకపోతే కష్టమేఈ విషయంపై పంత్ సహచర ఆటగాడు, టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ స్పందించాడు. పంత్ కోలుకోలేకపోతే తమకు ఎదురుదెబ్బ తప్పదని పేర్కొన్నాడు. అయితే, పంత్ లేకపోయినా మిగిలిన బ్యాటర్లు సత్తా చాటి జట్టును పటిష్ట స్థితిలో నిలపగలరని ధీమా వ్యక్తం చేశాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని స్కాన్స్ కోసం పంపించారు. రాత్రికల్లా రిపోర్టులు వస్తాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే చాలా కష్టం. అతడు ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఒకవేళ గాయం తీవ్రతరమై తిరిగి బ్యాటింగ్‌కు రాకపోతే మాత్రం.. ఇందుకు సంబంధించిన పరిణామాలు మేము ఎదుర్కోకతప్పదు.మరేం పర్లేదు.. మిగిలిన వాళ్లు చాలుఅయితే, జట్టులో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నవాళ్లు.. మిగిలిన ఆల్‌రౌండర్లు ఉన్నారు. కాబట్టి మా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతికూల పరిస్థితులు అధిగమిస్తాం. పంత్ లేనిలోటును పూడ్చేందుకు మా వాళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడాల్సి ఉంటుంది’’ అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు.గెలిస్తేనే.. నిలుస్తారుకాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో భాగంగా 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియా.. మాంచెస్టర్‌లో గెలిస్తేనే గెలుపు అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముప్పై పరుగులే చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను రెండో టెస్టు నుంచి తప్పించారు.తాజాగా నాలుగో టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సాయి.. 151 బంతులు ఎదుర్కొని 61 పరుగులతో అదరగొట్టాడు. కాగా తొలి రోజు ఆటలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) శుభారంభం అందించగా.. సాయి దానిని కొనసాగించాడు. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (12) మరోసారి విఫలం కావడం.. పంత్ 37 పరుగుల వద్ద మైదానం వీడటం ప్రభావం చూపాయి. ఆట పూర్తయ్యేసరికి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ చెరో పందొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పంత్‌కు తీవ్రగాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడికాలికి గాయమైంది.దీంతో 37 పరుగులు చేసిన రిషబ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ గాయపడక ముందు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి పర్యాటక జట్టు వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. పంత్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో టెస్టుల్లో 1004 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంత్ దారిదాపుల్లో ఎవరూ లేరు.ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్లు వీరే..1004 పరుగులు-రిషబ్ పంత్ (భారత్)*778 పరుగులు- ఎంఎస్ ధోని (భారత్)773 పరుగులు - రాడ్ మార్ష్ (ఆస్ట్రేలియా)684 పరుగులు - జాన్ వైట్ (దక్షిణాఫ్రికా)624 పరుగులు - ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్లు వీరే..1000 – రిషబ్ పంత్ (ఇంగ్లాండ్)879 – రిషబ్ పంత్ (ఆస్ట్రేలియా)778 – ఎంఎస్ ధోని (ఇంగ్లాండ్)773 – రాడ్ మార్ష్ (ఇంగ్లాండ్)717 – ఆండీ ఫ్లవర్ (భారతదేశం)👉ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన పర్యాటక వికెట్ కీపర్‌గా పంత్(879) కొనసాగుతున్నాడు.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. భారత బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(58), సాయిసుదర్శన్(61), కేఎల్ రాహుల్(46) రాణించారు.చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో -
గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు మాంచెస్టర్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ఇంగ్లీష్ జట్టుతో ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు.రెండో సెషన్ యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. ఈ క్రమంలో గిల్ మైదానంలో అడుగుపెట్టగానే ఇంగ్లండ్ అభిమానులు గట్టిగా అరుస్తూ గేలి చేశారు.లార్డ్స్ టెస్టులో గిల్ వ్యవహరించిన తీరు కారణంగా ఇంగ్లీష్ జట్టు అభిమానులు ఇలా చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో గిల్ ఔటైన తీరుపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ట్రాప్‌లో గిల్ చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్ వేసిన స్టోక్స్.. తొలి బంతిని గిల్‌కు అద్బుతమైన ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో గిల్ విఫలమయ్యాడు.ఆ ఇన్‌స్వింగర్ బంతిని గిల్ ఆడకుండా వదిలేశాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్అయ్యి గిల్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ రాడ్ టక్కర్ ఔట్ అంటూ వేలు పైకెత్తాడు.దీంతో గిల్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న సాయిసుదర్శన్‌తో మాట్లాడి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి ఆఫ్‌స్టంప్‌కు తాకినట్లు తేలింది. దీంతో 12 పరుగులు చేసిన గిల్ మైదానాన్ని వీడక తప్పలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ బర్మి ఆర్మీ గిల్‌ను ట్రోలు చేసింది. "గిల్ సమయాన్ని తన వృధా చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడని" ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు Captain 🆚 captainAnd Ben Stokes comes out on top! 🔥🇮🇳 1️⃣4️⃣0️⃣-3️⃣ pic.twitter.com/kjpBIGpp5K— England Cricket (@englandcricket) July 23, 2025 -
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు తీవ్రగాయమైంది. తొలి రొజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మూడో బంతికి పంత్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో రిషబ్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఈ ఢిల్లీ ఆటగాడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ రిటైర్డ్ హార్ట్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ గాయపడడం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. అస్సలు రెండో రోజు ఆటలో పంత్ బ్యాటింగ్ వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకుముందు లార్డ్స్ టెస్టులో కూడా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తాజా గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది."మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. అతడిని స్కాన్ల కోసం అస్పత్రికి తరలించారు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" భారత క్రికెట్ బోర్డు ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58), రాహుల్ (46) రాణించగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. ఇక యువ ఆటగాడు సాయిసుదర్శన్(61) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్ల పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.చదవండి: IND vs ENG: భారత మాజీ వికెట్ కీపర్‌కు అరుదైన గౌరవం..𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Rishabh Pant was hit on his right foot while batting on Day 1 of the Manchester Test. He was taken for scans from the stadium. The BCCI Medical Team is monitoring his progress.— BCCI (@BCCI) July 23, 2025 -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. శార్దూల్ ఎంపికపై తీవ్రమైన వ్యతిరేకత
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును రెండు రోజుల ముందే ప్రకటించగా.. భారత్ గతంలో మాదిరే ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవెన్‌ను అనౌన్స్ చేసింది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తప్పనిసరి పరిస్థితిలో ఓ మార్పు చేయగా.. భారత్ ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మూడో టెస్ట్ సందర్భంగా గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో ఇంగ్లండ్ లియామ్ డాసన్‌ను బరిలోకి దించగా.. భారత్ కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి తీసుకుంది.భారత్ చేసిన ఈ మూడు మార్పుల్లో రెండు సహేతుకమైనవే కాగా.. ఓ మార్పును మాత్రం టీమిండియా అభిమానులు స్వాగతించలేకపోతున్నారు. ఫామ్‌లో లేని కరుణ్ నాయర్‌కు బదులుగా సాయి సుదర్శన్.. గాయపడిన ఆకాశ్‌దీప్‌కు బదులుగా అన్షుల్ కంబోజ్ ఎంపికను సమర్దిస్తున్న ఫ్యాన్స్.. నితీశ్ కుమార్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా శార్దూల్ ఠాకూర్ ఎంపికను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ మ్యాచ్‌లో అసలు శార్దూల్ అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమనుకుంటే బౌలర్‌ను.. లేదనుకుంటే బ్యాటర్‌ను తీసుకోవాలి కాని.. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు పూర్తిగా న్యాయం చేయలేని శార్దూల్ ఎంపిక దండగ అని మండిపడుతున్నారు. ఏ ఆప్షన్ లేక శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబడుతున్నారు. ఆల్‌రౌండర్ అన్న ట్యాగ్ ఉంది కాబట్టి ప్రతిసారి శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేయడం సరికాదని అంటున్నారు.వాస్తవానికి శార్దూల్ విషయంలో అభిమానుల ఆగ్రహానికి కారణాలు లేకపోలేదు. ఈ సిరీస్‌లోనే కాకుండా గతంలో చాలా సార్లు అతన్ని ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకొని ఏ విభాగంలోనూ పూర్తిగా వినియోగించుకోలేదు. శార్దూల్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసి ప్రతిసారి ఓ స్థానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తారు. ఇదే అభిమానులకు చిరాకు తెప్పిస్తుంది. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక ఎవరో ఒకరు అన్న ధోరణిలో శార్దూల్‌ను ఎంపిక చేయడాన్ని ఫ్యాన్స్ తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఏం చేస్తాడో చూడాలి మరి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 32, యశస్వి జైస్వాల్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
అనిల్ కుంబ్లే తర్వాత అన్షుల్.. బీసీసీఐ స్పెషల్ వీడియో వైరల్
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆకాశ్ దీప్ స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మాంచెస్టర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా అన్షుల్ రికార్డులకెక్కాడు.కుంబ్లే తర్వాత అన్షులేఅంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 1990లో ఇదే వేదికపై భారత్ తరఫున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే, ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే..ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అనిల్ కుంబ్లే, అన్షుల్ కంబోజ్ ఇద్దరూ 10 వికెట్ల హాల్ కలిగి ఉండటం విశేషం. ఓ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతి కొద్ది మంది బౌలర్ల జాబితాలో ఉన్న వీరు.. ఒకే వేదికపై టెస్టులో అడుగుపెట్టడం గమనార్హం.ఎవరీ అన్షుల్ కంబోజ్?కాగా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో అన్షుల్ 318వ ప్లేయర్. 24 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ స్వస్థలం హర్యానాలోని కర్నాల్. గతేడాది రంజీ ట్రోఫీలో భాగంగా రోహ్తక్ వేదికగా కేరళతో మ్యాచ్‌లో అన్షుల్ అదరగొట్టాడు. కేరళ ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చి సత్తా చాటాడు.తాజాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుతో అన్షుల్ కంబోజ్ అరంగేట్రం సందర్భంగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా 2022లో ఢిల్లీ వేదికగా త్రిపురతో మ్యాచ్ సందర్భంగా అన్షుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు.గత మూడేళ్లకాలంలో ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లు ఆడిన అన్షుల్ కంబోజ్ 79 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 486 పరుగులు కూడా ఉన్నాయి. గతేడాది దులిప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-సి తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన కంబోజ్ 16 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ గడ్డ మీదఇక ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఎ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ అన్షుల్ కంబోజ్ భాగమయ్యాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో అనధికారిక టెస్టులో నాలుగు వికెట్లు కూల్చడంతో పాటు.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.ఇక ఐపీఎల్లో గతేడాది ముంబై ఇండియన్స్‌కు ఆడిన అన్షుల్.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటి వరకు మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు ఆడి పది వికెట్లు కూల్చాడు.వెనుకబడిన టీమిండియాఇదిలా ఉంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్ గిల్. అతడి సారథ్యంలో లీడ్స్‌లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అయితే, లార్డ్స్‌లో చివరి వరకు పోరాడి టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ వేదికపై ఒక్కసారి కూడా టెస్టు మ్యాచ్ గెలవని టీమిండియా.. ఈసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక ఈ మ్యాచ్‌కు ముందే ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ గాయాల వల్ల దూరం కాగా.. వీరి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుదిజట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ గిల్ వెల్లడించాడు. మరోవైపు.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్‌పై వేటు పడగా.. సాయి సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.Shine on, young lad 🙌🙌#TeamIndia #ENGvIND https://t.co/BLDRZz8Gu7— BCCI (@BCCI) July 23, 2025 -
ENG Vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. టీమిండియాలో మూడు మార్పులు
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో ఇవాళ (జులై 23) మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌తో 24 హర్యానా యువ పేసర్ అన్షుల్ కంబోజ్ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల కిందటే తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్ ఆడిన జట్టు నుంచి గాయపడిన షోయబ్ బషీర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
శార్దూల్ ఠాకూర్‌తో పాటు అతడినీ ఆడించాల్సిందే: మాజీ క్రికెటర్లు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో కీలకమైన నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమైంది. అయితే, ఇంగ్లండ్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గాయాల బెడద వేధించడం ఆందోళన రేకెత్తిస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం వల్ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అదే విధంగా.. పేస్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాల వల్ల మాంచెస్టర్ టెస్టు ఆడటం లేదు. దీంతో తుదిజట్టు కూర్పుపై ఇంత వరకు స్పష్టత రాలేదు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఆకాశ చోప్రా, దీప్‌దాస్ గుప్తా తదితరులు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు. లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన జట్టులో కైఫ్ రెండు మార్పులు సూచించాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని శార్దూల్ ఠాకూర్‌తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు.అదే విధంగా.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు అన్క్యాప్డ్ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను ఆడించాలని సూచించాడు. ప్రసిద్ క్రిష్ణ కంటే అన్షుల్ బెటర్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. సంజయ్ బంగర్ సైతం శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలని సూచించాడు. ఇప్పటికే జట్టులో ఉన్న ఇద్దరు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు శార్దూల్ కూడా ఉంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అయితే, అన్షుల్‌ను కాకుండా అనుభవమున్న ప్రసిద్ కృష్ణను పేస్ దళంలో చేర్చాలని బంగర్ సూచించడం గమనార్హం. అయితే, కైఫ్, బంగర్‌లకు భిన్నంగా నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం శార్దూల్ ఠాకూర్ జట్టుకు అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.అదే విధంగా.. కరుణ్ నాయర్‌కు బదులు ధ్రువ్ జురెల్‌ను, ప్రసిద్ కృష్ణ లేదంటే అన్షుల్ కాంబోజ్‌లలో ఒకరిని జట్టులో చేర్చాలని సూచించాడు. మరోవైపు.. దీప్‌దాస్ గుప్తా మాత్రం కైఫ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. నితీశ్ రెడ్డికి బదులు బ్యాటర్ శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్‌నకు బదులు అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.మహ్మద్ కైఫ్ ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.సంజయ్ బంగర్ ఎంచుకున్న తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.తుదిజట్టుపై నవజ్యోత్ సింగ్ సిద్ధు అంచనాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ/అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.దీప్‌దాస్ గుప్తా ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కాగా బుధవారం (జూలై 23) నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలుకానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం ఇందుకు వేదిక. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. -
ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ టెస్టులో భారత తుదిజట్టు కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు వేయాలని.. అతడి స్థానంలో సాయి సుదర్శన్ ఆడించాలని మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.అదే విధంగా.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను కాపాడుకునేందుకు ధ్రువ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా బరిలోకి దించాలని సూచిస్తున్నారు. ఇక ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్‌ను అరంగేట్రం చేయించాలని కొంత మంది పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నారు.వికెట్ కీపర్‌గానూ పంత్అయితే, నాలుగో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. రిషభ్ పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశాడు. అతడే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని తెలిపాడు. అదే విధంగా.. మూడో పేసర్‌గా అన్షుల్‌తో పాటు ప్రసిద్ కృష్ణ కూడా రేసులో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ఈ విశ్లేషణల నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడిస్తారేమోనంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ అభిని గనుక ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే అవుతుందని అశూ అభిప్రాయపడ్డాడు.ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే‘‘ఒకవేళ ఈ టెస్టులో అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడిస్తే.. అది అతడికి అన్యాయం చేసినట్లే. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి బాగానే ఆడాడు అనుకోండి.. అప్పుడు తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు సంబంధించిన షాట్లు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో దర్శనమిస్తాయి.అభిమన్యు ఈ టెస్టులో ఆడాలనే నేను కోరుకుంటున్నారు. ప్రపంచంలోని అన్ని సంతోషాలు అతడికి దక్కాలి. ఒకవేళ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో అభి బ్యాట్ ఝులిపించలేకపోతే.. అప్పుడు పరిస్థితి ఏంటి?మూడో స్థానంలో సాయి సుదర్శన్ విఫలమయ్యాడు. అతడి స్థానంలో కరుణ్ నాయర్‌ను ఆడించారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి అభిమన్యును తీసుకుంటారా? ఒకవేళ అలా చేస్తే ఈ ఓపెనింగ్ బ్యాటర్ అక్కడ రాణించగలడా?’’ అని అశ్విన్ ప్రశ్నించాడు.సాయి సుదర్శన్ సరైన ఎంపికఅందుకే ఈసారికి కరుణ్ నాయర్‌పై వేటు వేయాలని భావిస్తే.. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను ఎంపిక చేయాలని అశూ సూచించాడు. అలా కాకుండా.. ఊహించని రీతిలో అభిమన్యును జట్టులోకి తీసుకుంటే.. అతడు రాణించకపోతే.. సాయి లాగే ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితమవుతాడని అభిప్రాయపడ్డాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లో బుధవారం నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌తో సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేసి.. తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. మరోవైపు.. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ కూడా గాయపడి నాలుగో టెస్టుకు దూరమయ్యారు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్/ శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ/ అన్షుల్ కాంబోజ్.చదవండి: డివిలియర్స్ విధ్వంసం.. యువీకి గాయం.. ఇండియా చాంపియన్స్‌కు షాక్ -
IND vs ENG: భారత తుదిజట్టులో మూడు మార్పులు ఇవే!
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన తుదిజట్టులో మూడు మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ వరుసగా విఫలమవుతున్నాడన్న ఇర్ఫాన్ పఠాన్.. అతడిని పక్కకపెట్టక తప్పదన్నాడు.కరుణ్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు చోటివ్వాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇంగ్లండ్ బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కోవడంలో అంతగా సఫలం కాలేకపోతున్నారని.. అందుకే సాయికి మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. అదే విధంగా.. అనివార్యమైన మరో రెండు మార్పుల గురించి కూడా ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు.కరుణ్ నాయర్ బెంచ్ మీదేఈ మేరకు.. ‘‘కరుణ్ నాయర్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి అతడి అత్యధిక స్కోరు 40 మాత్రమే. అయితే, మంచి బంతులకే అతడు అవుటయ్యాడు.ఒకవేళ అతడు పరుగులు రాబట్టడంలో సతమతమవుతున్నాడని భావిస్తే.. తప్పకుండా అతడిని బెంచ్‌కే పరిమితం చేయాలి. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. ఎందుకంటే అతడు ఎడమ చేతి వాటం బ్యాటర్. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టులను పరిశీలిస్తే ఇంగ్లండ్ బౌలర్లు లెఫ్టాండర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.వికెట్ కీపర్‌గా జురెల్ఇక రిషభ్ పంత్ కూడా గాయపడ్డాడనే సమాచారం ఉంది. కాబట్టి అతడు ఈసారి కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ వస్తే.. బ్యాటింగ్ విభాగంగా మరింత పటిష్టం అవుతుంది.భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు 90 పరుగులతో ఆకట్టుకున్న విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. వికెట్ కీపర్‌గా అతడు మరింత మెరుగుపడాలి.అన్షుల్ వద్దు.. అతడే బెటర్ఇక పేసర్ ఆకాశ్ దీప్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతడి ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా ఇప్పుడు ప్రసిద్ కృష్ణ జట్టులోకి వస్తాడు. అన్షుల్ కాంబోజ్ కూడా ఒకే. కానీ కీలక మ్యాచ్‌లో ప్రసిద్ కృష్ణనే ఆడిస్తే బెటర్. అతడి అనుభవం అక్కరకు వస్తుంది.ఇక అర్ష్‌దీప్ సింగ్ గాయపడి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఎలా చూసినా ప్రసిద్‌కు లైన్ క్లియర్ అయినట్లే. అన్షుల్ కాంబోజ్ తుదిజట్టులో ఉంటే బాగుంటుంది. అతడి బౌలింగ్ శైలి నాకెంతో ఇష్టం.కానీ ప్రస్తుతం అరంగేట్ర బౌలర్ కన్నా.. అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం ఉంది కాబట్టి.. నేను ప్రసిద్ వైపు మొగ్గుచూపుతాను’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్, ఆకాశ్ దీప్ ప్లేస్‌లో ప్రసిద్ కృష్ణను ఆడించాలన్న పఠాన్.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని బ్యాటర్ ధ్రువ్ జురెల్‌తో భర్తీ చేయాలని సూచించాడు. కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్ -
పంత్ ఫిట్.. బరిలో బుమ్రా
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టులో ఆడటం ఖాయమైంది. ఈ విషయాన్ని జట్టు సభ్యుడు మొహమ్మద్ సిరాజ్ నిర్ధారించాడు. ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు కూర్పులో ప్రతి రోజూ మార్పులు జరుగుతున్నాయని... అయితే బుమ్రాను ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు అతను వెల్లడించాడు. పని భారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ సిరీస్‌లో బుమ్రా ఏవైనా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడనే టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చివరి రెండు టెస్టుల్లో అతను ఎందులో బరిలోకి దిగుతాడనే విషయం టీమ్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఆడేందుకు సిద్ధం కావడంతో దీనిపై స్పష్టత వచి్చంది. గత టెస్టుకు, నాలుగో టెస్టుకు మధ్య ఎనిమిది రోజుల విరామం కూడా ఉండటంతో బుమ్రాకు తగినంత విశ్రాంతి కూడా లభించింది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో సమంగా నిలిస్తే ఓవల్‌లో జరిగే చివరి టెస్టులోనూ బుమ్రా ఆడే అవకాశం ఉంది. అర్‡్షదీప్ నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే మరో పేసర్ ఆకాశ్‌దీప్ ఆడటం కూడా సందేహంగానే ఉంది. సోమవారం అతను స్వల్పంగా ప్రాక్టీస్ చేసినా... దీని వల్ల ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి అంచనాకు రాలేదు. మరో రెండు రోజుల సాధన తర్వాతే అతని విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. వికెట్ కీపర్ పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో అతను బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడు. సాయి సుదర్శన్‌కు చాన్స్! గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మాంచెస్టర్ టెస్టులో చోటు దక్కవచ్చు. సుదర్శన్ ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడాడు. అతను ఆడితే పిచ్ పరిస్థితిని బట్టి ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్లలో ఒకరికే అవకాశం లభిస్తుంది. ఆకాశ్‌దీప్ కూడా తప్పుకుంటే ప్రసిధ్, కొత్త ఆటగాడు అన్షుల్లలో ఒకరిని ఎంపిక చేస్తారు. రెండు టెస్టులు ఆడిన ప్రసిధ్ పూర్తిగా విఫలం కాగా... ఆకాశ్‌దీప్ శైలిలోనే సీమ్ బౌలింగ్ చేసే అన్షుల్ అరంగ్రేటం చేసే చాన్స్ ఉంది. అయితే ఆటగాళ్ల గాయాలతో టీమ్‌లో ఎన్నో మార్పులు జరుగుతున్నా... ఆశ్చర్యకరంగా జట్టులో ఉన్న ఏకైక రెగ్యులర్ స్పిన్నర్, ఇంగ్లండ్‌పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉన్న కుల్దీప్ యాదవ్ పేరు కూడా ప్రస్తావనకు రాకపోవడం ఆశ్చర్యకరం. టీమిండియా వ్యూహాల ప్రకారం చూస్తే కుల్దీప్ ఒక్క టెస్టూ ఆడకుండానే తిరిగి వచ్చేలా కనిపిస్తోంది. ఇంగ్లండ్ ఒక మార్పుతో... నాలుగో టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. గత టెస్టులో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ జట్టులోకి వచ్చాడు. 2017 తర్వాత అతనికి ఇదే తొలి టెస్టు కానుంది. ఇంగ్లండ్ తుది జట్టు: స్టోక్స్ (కెపె్టన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, డాసన్, క్రిస్ వోక్స్, కార్స్, జోఫ్రా ఆర్చర్. భారత్ తరఫున ఆడే అవకాశం రావడమే అన్నింటికీ ప్రేరణ అందిస్తుంది. దాంతోనే కావాల్సినంత ఉత్సాహం వస్తుంది. మైదానంలో వంద శాతం కష్టపడటమే నాకు తెలిసింది. దేవుని దయ వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నాను. పని భారం తగ్గించడం ముఖ్యమే కావచ్చు కానీ చివరకు నేను ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాననేదే స్కోరు బోర్డులో కనిపిస్తుంది. నాకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకొని జట్టును గెలిపించడమే నా లక్ష్యం. కాబట్టి ఎక్కువ ఓవర్లు వేయడంలో ఎలాంటి రహస్యమూ లేదు. ఏ బౌలరైనా వికెట్లు పడగొట్టేందుకు ప్రయతి్నస్తాడు. నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా కొన్నిసార్లు అదృష్టం కలిసి రావడం లేదు. గత సిరీస్‌తో పోలిస్తే ఈ సారి డ్యూక్స్ బంతులు తొందరగా మెత్త పడుతున్నాయనేది వాస్తవం. అయితే అన్నీ మనకు అనుకూలించవు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించడం ముఖ్యం. గత టెస్టులో చివరి వికెట్‌గా అవుటైనప్పుడు చాలా బాధపడ్డాను. దాని నుంచి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టింది. మ్యాచ్ మేం గెలవాల్సింది. జడేజా, బుమ్రా బాగా ఆడినా మేం ఓడాం. చాలా ముందే 80 పరుగుల తేడాతో ఓడిపోయినా ఇంతగా బాధపడేవాళ్లం కాదేమో. చాలా చేరువగా వచ్చి గెలవలేకపోవడం నిరాశకు గురి చేసింది. – మీడియా సమావేశంలో సిరాజ్ -
IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే!
స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారింది. పేసర్లలో ఆకాశ్ దీప్ (Akash Deep) ఫిట్‌నెస్‌లేమితో సతమతమవుతుండగా.. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. లోయర్ ఆర్డర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి?ఎడమ మోకాలికి గాయమైన కారణంగా నితీశ్ రెడ్డి ఇంగ్లండ్‌తో మిగిలిన ఉన్న రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ టెస్టు కోసం జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడా? అనే చర్చ జరుగుతోంది.లేదంటే.. బీసీసీఐ తాజాగా జట్టులోకి తీసుకున్న మరో ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్‌పై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శార్దూల్, అన్షుల్ ఇద్దరూ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కాబట్టి.. వీరిలో ఒకరికే అవకాశం ఇచ్చి.. ఆకాశ్ దీప్ స్థానాన్ని ప్రసిద్ కృష్ణతో భర్తీ చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది.తద్వారా అన్షుల్ రూపంలో ఆల్‌రౌండర్‌తో పాటు ప్రసిద్‌ను తీసుకోవడం ద్వారా పేస్ బౌలింగ్ దళం బలం కూడా పెరుగుతుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు తోడుగా ప్రసిద్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్అయితే, బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటే మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్ దక్కుతుంది. నిజానికి నాలుగో టెస్టులో రిషభ్ పంత్ వేలి గాయం కారణంగా.. కేవలం బ్యాటర్‌గానే అందుబాటులో ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వికెట్ కీపర్‌గా జురెల్‌కు లైన్ క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.కరుణ్ నాయర్‌పై ఈసారి వేటుమరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌పై ఈసారి వేటు పడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన కెరీర్లో రెండో టెస్టు ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టు వికెట్ దృష్ట్యా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఈసారైనా బరిలోకి దింపాలనే సూచనలు వస్తున్నాయి.కుల్దీప్ను ఈసారైనా ఆడించండిబంతిని రెండు వైపులా టర్న్ చేయగల సత్తా కుల్దీప్‌నకు ఉందని.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లు అంత సులువుగా కుల్దీప్ను అటాక్ చేయలేరని.. కాబట్టి అతడిని తప్పక తీసుకోవాలని సూచించాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఉన్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు కుల్దీప్ కూడా తోడైతే జట్టు మరింత పటిష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన జయభేరి మోగించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 22 పరుగుల తేడాతో గెలిచిన స్టోక్స్ బృందం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక. ఇందులో భారత్ తప్పకుండా గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్/అన్షుల్ కాంబోజ్.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని చూడగానే ఫిక్సయిపోయాం.. అతడొక అద్భుతం’ -
చరిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుబ్‌మన్ గిల్..
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. సిరీస్ సమమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. అతడు 2006 ఇంగ్లండ్ టూర్లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 90.14 సగటుతో 631 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 202గా ఉంటుంది.ఇప్పుడు మాంచెస్టర్‌లో శుబ్‌మన్ మరో 25 పరుగులు సాధిస్తే.. యూసుఫ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. అనంతరం బర్మింగ్‌హామ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు. అతడి అత్యధిక స్కోర్ 269గా ఉంది.ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లుమహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 2006లో 4 మ్యాచ్‌ల్లో 631 పరుగులుశుభ్మన్ గిల్ (భారత్) - 2025లో 3 మ్యాచ్‌ల నుండి 607 పరుగులురాహుల్ ద్రవిడ్ (భారత్) - 2002లో 4 మ్యాచ్‌ల నుండి 602 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్) - 2018లో 5 మ్యాచ్‌ల నుండి 593 పరుగులుసునీల్ గవాస్కర్ (భారత్) - 1979లో 4 మ్యాచ్‌ల నుండి 542 పరుగులుసలీమ్ మాలిక్ (పాకిస్తాన్) - 1992లో 5 మ్యాచ్‌ల నుండి 488 పరుగులుగిల్కు కఠిన పరీక్ష..కాగా మాంచెస్టర్ టెస్టు రూపంలో గిల్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఓడిన అనంతరం టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది.దీంతో ఇప్పుడు నాలుగో టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై -
'ఆకాష్ దీప్‌ను పక్కన పెట్టండి.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అమీతుమీ తెల్చుకోవడానికి ఇరు జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం లార్డ్స్ ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మెనెజ్‌మెంట్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కీలక సూచన చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే సరిపోతుందని అథర్టన్ అన్నారు. కాగా లార్డ్స్ టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఒకవేళ మాంచెస్టర్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భావిస్తే.. పేసర్ ఆకాష్‌దీప్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది."మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ ఫ్లాట్‌గా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో మణికట్టు స్పిన్నర్లు చక్రం తిప్పుతారు అని అందరికి తెలుసు. కాబట్టి భారత్ బుమ్రా, సిరాజ్‌లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, జడేజా,కుల్దీప్ యాదవ్‌లతో ఆడితే బాగుంటుంది.ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అయితే మాంచెస్టర్‌లో వాతావరణ పరిస్థితులపై మనకు అంచనా లేదు. ఒకవేళ వాతావరణం చల్లగా ఉండి, వర్షం పడితే ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తోంది. కానీ ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం కోసం భారత మెనెజ్‌మెంట్ కచ్చితంగా ఆలోచించాలి" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైఖేల్ అథర్టన్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా? -
‘బుమ్రా ఆడినపుడే.. టీమిండియా ఓడిపోతుంది’
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మాంచెస్టర్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని.. సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందే బుమ్రా పనిభారం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పేస్‌దళ నాయకుడిపై భారాన్ని తగ్గించేందుకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో.. అతడు కేవలం మూడింటిలో మాత్రమే ఆడతాడని వీరు స్పష్టం చేశారు.నో క్లారిటీఇందుకు తగ్గట్లుగానే లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్లీ లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్‌లో ఆడతాడా? లేదా? అన్న అంశంపై మేనేజ్మెంట్ ఇంతవరకు స్పష్టతనివ్వలేదు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడొక ప్రపంచస్థాయి బౌలర్ అంటూనే.. బుమ్రా ఆడిన మ్యాచ్‌లలో టీమిండియాకు ఎక్కువసార్లు ఓటమే ఎదురైందని పేర్కొన్నాడు. అతడు లేనప్పుడే చిరస్మరణీయ విజయాలు అందుకుందని విమర్శించాడు.టీమిండియా గెలిస్తే ఐదో టెస్టు ఆడతాడా?‘‘ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో బుమ్రా కేవలం మూడే ఆడతాడని కోచ్ గౌతం గంభీర్ స్వయంగా చెప్పాడు. అతడు ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడాడు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక్క టెస్టు మాత్రమే అతడు ఆడతాడన్నది తెలిసిందే.ఒకవేళ మేనేజ్మెంట్ తమ మాటకు కట్టుబడి ఉంటే.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తుందా? లేదంటే.. సిరీస్ ప్రాధాన్యత దృష్ట్యా ఐదో టెస్టులోనూ ఆడించాలని కోరుకుంటుందా?.. ఒకవేళ అతడు తదుపరి ఓల్డ్ ట్రఫోర్ట్ టెస్టులో ఆడి.. టీమిండియా గెలిస్తే అప్పుడు 2-2తో సిరీస్ సమం అవుతుంది.కాబట్టి సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో అతడిని ఆడించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా కాకుండా నాలుగో టెస్టులో టీమిండియా ఓడి 3-1తో సిరీస్ కోల్పోతే.. ఇక ఆఖరి టెస్టుకు అతడి అవసరం ఉండదని అనుకోవచ్చు.బుమ్రా జట్టులోనే ఉంటేనే ఓటమి?!ఇదొక అసాధారణ అంశం. ఏదేమైనా.. అతడు ఆడిన మ్యాచ్‌లలో టీమిండియా గెలిచిన సందర్భాల కంటే.. ఓడిన దాఖలాలే ఎక్కువని అంటూ ఉంటారు. అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్. అతడి బౌలింగ్ శైలి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఉత్తమ బౌలరే అయినా.. అతడి విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’’ అంటూ లాయిడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.కాగా 2018లో బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఇప్పటికి 47 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో టీమిండియా 20 గెలవగా.. 23 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో బుమ్రా మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ ఇందులో గిల్ సేన ఓటమిపాలైంది. ఇక రెండో టెస్టుకు అతడు దూరంగా ఉండగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో ఓడించి ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.ఇక మూడో టెస్టుతో తిరిగి వచ్చిన బుమ్రా మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన (మొత్తం ఏడు వికెట్లు)తో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23-27) జరుగనుంది.చదవండి: జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్ జితేశ్ శర్మ -
కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England 5th Test To Be Held In July 2022: ఐపీఎల్-2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రద్దైన ఐదో టెస్ట్(మాంచెస్టర్) మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు క్లారిటీ ఇచ్చాయి. భారత శిబిరంలో కరోనా కేసు వెలుగు చూడడంతో రద్దైన ఆ మ్యాచ్‌ను వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుండగా.. అందులో భాగంగా జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రద్దైన టెస్ట్ జరుగుతుందని ఇరు దేశాల బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య 3 టీ20లు (జులై 7, 9, 10), 3 వన్డేలు(జులై 12, 14, 17) జరగనున్నాయి. కాగా, భారత్- ఇంగ్లండ్‌ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా నిర్దారణ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే.. -
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
ఐదో మ్యాచ్ రద్దు.. 2-1 ఆధిక్యంలో టీమిండియా.. ఇక..
మాంచెస్టర్: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైంది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. కాగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ ట్రఫోర్ట్ మైదానంలో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ కోహ్లి సేన సొంతం కావడం ఇక లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు... అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన ఐదో టెస్టు కోవిడ్ కారణంగా రద్దు కావడంతో.. జూలైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(పరిమిత ఓవర్ల క్రికెట్) నేపథ్యంలో అప్పుడు ఈ టెస్టు మ్యాచ్ నిర్వహించేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ఫలితం ఆధారంగానే సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌కు ముందు గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు మహమ్మారి బారిన పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తొలుత ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చాకే మ్యాచ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐతో చర్చించిన అనంతరం మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఆటగాళ్లందరికీ నెగిటివ్ వచ్చినప్పటికీ ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఇక నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నిర్ణయాత్మక ఐదో టెస్టు రద్దైంది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్ -
నాలుగో టెస్టులో భారత్ ఘోర పరాజయం
నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన యోధునుయోధులనుకున్న బ్యాట్స్ మన్ అంతా వరుసపెట్టి పెవిలియన్ బాట పట్టారు. దాంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 161 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉందనగానే మ్యాచ్ ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్ లోనే 215 పరుగుల ఆధిక్యం సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మూడో రోజు భారత జట్టును మళ్లీ బ్యాటింగ్‌కు దించింది. అయితే, భారత జట్టుల సరిగ్గా 43 ఓవర్లలోనే 161 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మురళీ విజయ్ (18), గౌతమ్ గంభీర్ (18), ఛటేశ్వర్ పుజారా (17), విరాట్ కోహ్లీ (7) అజిక్య రహానే (1), రవీంద్ర జడేజా (4), ధోనీ (27), భువనేశ్వర్ కుమార్ (10), ఆరోన్ (9), పంకజ్ (0) పరుగులకు ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడు మాత్రం 46 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంతో ఉన్నట్లయింది.