
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు తీవ్రగాయమైంది. తొలి రొజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మూడో బంతికి పంత్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో రిషబ్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఈ ఢిల్లీ ఆటగాడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ రిటైర్డ్ హార్ట్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ గాయపడడం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
అస్సలు రెండో రోజు ఆటలో పంత్ బ్యాటింగ్ వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకుముందు లార్డ్స్ టెస్టులో కూడా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తాజా గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.
"మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. అతడిని స్కాన్ల కోసం అస్పత్రికి తరలించారు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" భారత క్రికెట్ బోర్డు ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58), రాహుల్ (46) రాణించగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. ఇక యువ ఆటగాడు సాయిసుదర్శన్(61) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్ల పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.
చదవండి: IND vs ENG: భారత మాజీ వికెట్ కీపర్‌కు అరుదైన గౌరవం..
𝗨𝗽𝗱𝗮𝘁𝗲:
Rishabh Pant was hit on his right foot while batting on Day 1 of the Manchester Test.
He was taken for scans from the stadium.
The BCCI Medical Team is monitoring his progress.