ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సీఎస్‌కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనికి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉల్లంఘించాడంటూ అతనిపై నమోదైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ కమిటీ కొట్టిపారేసింది. ఈ కేసులో ఎథిక్స్ కమిటీ అధికారి అరుణ్ మిశ్రా (రిటైర్డ్) ధోనికి క్లీన్ చిట్ ఇచ్చారు.
టీమిండియా ఆటగాడిగా ఉంటూనే, 'ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' అనే క్రికెట్ అకాడమీతో అనుబంధం (యజమానిగా) కొనసాగించడని ధోనిపై 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు నమోదైంది. ఇలా వ్యవహరించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొనబడింది. 2018లో సవరించిన రూల్ 38(4)(a), 38(4)(p) ప్రకారం ఇది తప్పు అని ఫిర్యాదుదారు వాదించారు. అదనంగా, ధోని తప్పనిసరి డిస్క్లోజర్ బాధ్యతలను కూడా నిర్వర్తించలేదని ఆరోపించారు.
ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జస్టిస్ మిశ్రా.. ధోని ఎలాంటి తప్ప చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారు. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి విరుద్ధ ప్రయోజనాల కేసు నిలబడదని స్పష్టం చేశారు. ధోని 2017లో ఆర్కా సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, బీసీసీఐ సవరించిన నిబంధనలు 2018 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు.
అందువల్ల, ధోని ఆటగాడిగా ఉన్న సమయంలో ఎలాంటి విరుద్ధ ప్రయోజనం లేదని తేల్చారు. ఫిర్యాదుదారుడు వ్యక్తిగత కారణాలతోనే ఈ కేసు వేసినట్లు తీర్పులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ధోనిని 2026 ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే సీఈవో ఇటీవల చెప్పిన దాని ప్రకారం.. ధోని ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. వయసు పైబడిన రిత్యా ధోని ఈ సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరని తొలుత ప్రచారం జరిగింది. తాజాగా సీఈవోనే స్పష్టత ఇవ్వడంతో ఉహాగానాలకు తెరపడింది.
2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను నిన్ననే విడదల చేశారు. ఈ విడతలో అన్ని ఫ్రాంచైజీల్లాగే సీఎస్‌కే కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.
తొలి దశలో సీఎస్‌కే షెడ్యూల్
- మార్చి 30: CSK vs RR – గౌహటి
- ఏప్రిల్ 3: CSK vs PBKS – చెన్నై
- ఏప్రిల్ 5: CSK vs RCB – బెంగళూరు
- ఏప్రిల్ 11: CSK vs DC – చెన్నై
కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.


