షాహీన్‌ అఫ్రిది సంచలన నిర్ణయం | Shaheen Afridi Stuns IPL Teams In The Hundred 2026 Auction With Shocking Move | Sakshi
Sakshi News home page

షాహీన్‌ అఫ్రిది సంచలన నిర్ణయం

Mar 12 2026 3:39 PM | Updated on Mar 12 2026 3:57 PM

Shaheen Afridi Stuns IPL Teams In The Hundred 2026 Auction With Shocking Move

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ వేలం ఇవాళ (మార్చి 12) జరగాల్సి ఉంది. అయితే వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు అఫ్రిది తన పేరును ఉపసంహరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేలంలో పాల్గొంటున్న అతి కొద్ది మంది పాకిస్తాన్‌ ఆటగాళ్లలో అఫ్రిది ఒకరు. అఫ్రిది లక్ష పౌండ్ల (రూ. 1.23 కోట్లు) బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

అఫ్రిది చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకొని, తన కోసం ప్రణాళికలు వేసుకున్న ఫ్రాంచైజీలను భారీగా దెబ్బకొట్టాడు. అఫ్రిదితో పాటు  క్వింటన్‌ డికాక్‌, సునీల్‌ నరైన్‌, అల్లా ఘజన్‌ఫర్‌, పీటర్‌ సిడిల్‌ కూడా ఆఖరి నిమిషంలో హండ్రెడ్‌ లీగ్‌ వేలం నుంచి తమ పేర్లను వెనక్కి తీసుకున్నారు.  

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు దెబ్బ
ప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌ యాజమాన్యాలు పాకిస్తాన్‌ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్‌ లీగ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే, ఈ లీగ్‌ నిర్వాహకులు పాక్‌ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. 

తొలిసారి జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ వేలానికి 63 మంది పాకిస్తాన్‌ ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. వీరిలో షాహీన్‌ అఫ్రిది కూడా ఉన్నాడు. 

అఫ్రిది కోసం ఐపీఎల్‌ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కూడా పోటీపడే అవకాశం ఉండింది. అఫ్రిది చివరి నిమిషంలో వేలం నుంచి వైదొలగడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఎదురుదెబ్బ తగినట్లైంది. అఫ్రిది ఏ కారణం చేత వేలం నుంచి వైదొలిగాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఇదిలా ఉంటే, మహిళల విభాగం హండ్రెడ్‌ లీగ్‌ వేలం​ నిన్ననే జరిగింది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement