దూసుకెళ్తోన్న యూకీ బాంబ్రీ జోడి | Yuki Bhambri Reaches Quarters In Indian Wells Tourney With Andre Goransson | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తోన్న యూకీ బాంబ్రీ జోడి

Mar 12 2026 1:32 PM | Updated on Mar 12 2026 1:46 PM

Yuki Bhambri Reaches Quarters In Indian Wells Tourney With Andre Goransson

ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో భారత టాప్‌ డబుల్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ అదరగొడుతున్నాడు. తన పార్టనర్‌ ఆండ్రీ గొరాన్‌సన్‌తో కలిసి టోర్నీలో బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. 

గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ-ఆండ్రీ గొరాన్‌సన్‌ ద్వయం 6-3, 7-6తో అలెగ్జాండర్‌ (ఆస్ట్రియా)-వవస్సోరీ (ఇటలీ) జోడీని రెండు సెట్లలోనే కంగుతినిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. 

గంటా 30 నిమిషాల పాటు సాగిన పోరులో ఇండో-స్వీడిష్‌ ద్వయం తొలి సర్వ్‌ నుంచే స్పష్టమైన ఆధిపత్యం చూపెడుతూ వచ్చింది. మ్యాచ్‌లో 29 విన్నింగ్‌ పాయింట్లు సాధించింది. ఇక సెమీస్‌లో ఆర్థర్‌ రిండర్‌నెక్‌( ఫ్రాన్స్‌)-వలెంటిన్‌ వచెరొట్‌ (మొనాకో) జోడీని ఎదుర్కోనుంది. 

అంతకముందు బుధవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో బాంబ్రీ జోడీ 6-4, 6-4తో ఆరెండ్స్‌-లెహెక్కా జోడీపై విజయం సాధించింది. మ్యాచ్‌లో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా నమోదు చేయని బాంబ్రీ జోడీ ప్రత్యర్థి బ్రేక్‌ పాయింట్లను మాత్రం రెండుసార్లు బ్రేక్‌ చేయడం జరిగింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జోడీపై దూకుడు ప్రదర్శించిన యూకీ బాంబ్రీ జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని కంగుతినిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement