ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు | Olivia Gadecki and John Peers Create History, Break 37 Year Old Australia Open World Record | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు

Jan 30 2026 4:19 PM | Updated on Jan 30 2026 4:38 PM

Olivia Gadecki and John Peers Create History, Break 37 Year Old Australia Open World Record

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2026లో సంచలనం నమోదైంది. మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగంలో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ టైటిల్‌ గెలిచింది. ఇదే జోడీ గతేడాది కూడా టైటిల్‌ ఎగరేసుకుపోయింది. తద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో టైటిల్‌ గెలిచిన జోడీగా 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్‌ పగ్‌ జోడీ వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు గెలిచింది.

తాజా టైటిల్‌తో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. మార్గరెట్‌ కోర్ట్‌-కెన్‌ ఫ్లెచర్‌ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్‌ టైటిళ్లు సాధించిన జోడీగా చరిత్ర సృష్టించింది.

రాడ్‌ లేవర్‌ ఎరీనాలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ జోడీ ఫ్రెంచ్‌ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గడెకీ-పియర్స్‌ జోడీ టైబ్రేక్‌లో 5-7 వెనుకబడినప్పటికీ, చివరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement