టీమిండియా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. అయితే బుమ్రా తన పెళ్లి రోజు వేడుకను పురస్కరించుకొని తన భార్యకు పంపిన రెండు ముక్కల సందేశం అతన్ని ట్రోల్‌కు గురయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సంజనా గణేశన్‌కు ‘హ్యాపీ యానివర్సరీ’ అని రెండు ముక్కల్లోనే విషెస్ తెలిపాడు.
బుమ్రా పోస్ట్‌పై సంజనా గణేశన్ స్పందిస్తూ.. ‘కిడ్నీ టచ్చింగ్ క్యాప్షన్ యార్’ అని పేర్కొంది. ఆ తర్వాత బుమ్రాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న సంజనా గణేశన్.. ‘జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, ప్రపంచం ఎంతదూరం తీసుకెళ్లినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నా ప్రాణ స్నేహితుడితో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.
నీ కౌగిలిలో నన్ను బంధించి నన్ను మైమరపించావు. కానీ నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది మన ప్రేమకథే అని బలంగా చెప్పగలను. లవ్ యూ బుమ్రా’ అంటూ మరో పోస్టును షేర్ చేసుకుంది. ఇక స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో బుమ్రాకు 2013లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది.
రెండేళ్లు డేటింగ్ చేసిన అనంతరం మార్చి 15, 2021న ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ దంపతులకు 2023లో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.
చదవండి: ‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’


