పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్ ఓటమి అనంతరం షాహిద్ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్టును షేర్ చేసుకున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్ కమిటీదే.
ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షహీన్ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలి. బాబర్ ఆజమ్ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారు. కెప్టెన్‌గా అతనికి మంచి రికార్డు ఉంది.
కనీసం ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీస్ చేరడంలో విఫలమైంది. తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో కోల్పోవడం చూస్తుంటే ఇదంతా సెలక్షన్ కమిటీ తప్పిదమేని క్లియర్‌గా తెలుస్తోంది.
అసలు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలన్న విషయం కూడా పీసీబీ అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. జాతీయ జట్టుకు సర్జరీ అనే పేరుతో మార్పులు అంటూ ఇప్పటికే చాలా చేశారు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి.
దేశవాలీ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా తయారవుతుంది. పాక్ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే స్థాయి ఎప్పుడో కనుమరుగైంది. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టించింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రతీ టోర్నీలో అపజయాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
చదవండి: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!


